Happy Birthday Day Ram Gopal Varma | తెలుగు సినీ ఇండస్ట్రీలో కాదు.. కాదు.. భారతీయ సినీ పరిశ్రమలో దర్శకుడిగా రామ్ గోపాల్ వర్మ స్టైలే వేరు. ఈయన నచ్చితే సినిమా తీస్తాడు. నచ్చక పోయినా సినిమానే తీస్తాడు. భారతీయ హిచ్కాక్గా పేరు సంపాదించారు ఆర్జీవి. టాలీవుడ్, బాలీవుడ్లో ఎంతో మంది దర్శకులు వర్మ దగ్గర ఓనమాలు నేర్చుకొని ఇండస్ట్రీలో తమకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. వారిలో పూరీ జగన్నాథ్, కృష్ణవంశీ, తేజ, హరీష్ శంకర్, జేడి చక్రవర్తి ఇలా చెప్పుకుంటూ పోతే.. వర్మ ఇన్స్ప్రేషన్తో ఎంతో మంది దర్శకులు అయ్యారు. (Twitter/Photo)
శివ నాగేశ్వరరావు | రామ్ గోపాల్ వర్మ శిష్యుల్లో‘మనీ’ ఫేమ్ దర్శకుడు శివ నాగేశ్వరరావు ఒకరు. అసలు ఆర్జీవి శిష్యుడు శివనాగేశ్వరరావు అనే కంటే.. వర్మకు దర్శకుడిగా శివ సినిమా సమయంలో క్లాప్ బోర్డ్ పట్టుకోవడం దగ్గర నుంచి ఓ దర్శకుడు ఏమేమి చేయాలో అంత దగ్గరుండి వర్మకు అందులో ఓనమాలు నేర్పించారు శివ నాగేశ్వరరావు. ఆ తర్వాత వర్మ.. తనకు దర్శకత్వంలో మెలకువలు నేర్పిన శివ నాగేశ్వరరావుకు ‘మనీ’ సినిమాతో దర్శకుడిగా ఛాన్స్ ఇచ్చాడు. (Twitter/Photo)
గుణ శేఖర్, ఉత్తేజ్లతో రామ్ గోపాల్ వర్మ. తెలుగు సినీ ఇండస్ట్రీలో కాదు.. కాదు.. భారతీయ సినీ పరిశ్రమలో దర్శకుడిగా రామ్ గోపాల్ వర్మ స్టైలే వేరు. ఈయన నచ్చితే సినిమా తీస్తాడు. నచ్చక పోయినా సినిమానే తీస్తాడు. భారతీయ హిచ్కాక్గా పేరు సంపాదించారు ఆర్జీవి. టాలీవుడ్, బాలీవుడ్లో ఎంతో మంది దర్శకులు వర్మ దగ్గర ఓనమాలు నేర్చుకొని ఇండస్ట్రీలో తమకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. (Twitter/Photo)