ఇక ధనుశ్ నటించిన పలు సినిమాలు తెలుగులో రీమేక్ అయి సూపర్ హిట్అందున్నాయి. రీసెంట్గా వెంకటేష్ చేసిన ‘నారప్ప’ కూడా తమిళంలో ధనుశ్ చేసిన ‘అసురన్’ మూవీకి రీమేక్‌గా తెరకెక్కింది. మధ్యలో కొన్ని డబ్బింగ్ సినిమాలతో పలకరించిన ధనుశ్.. ఇపుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో డైరెక్ట్‌గా టాలీవుడ్ ఇండస్ట్రీని పలకరించబోతున్నారు. అంతేకాదు ధనుశ్ బాటలో మరికొంత మంది తమిళ హీరోలు తెలుగులో డైరెక్ట్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. Dhanush Sekhar Kammula Photo : Twitter
తమిళ స్టార్ హీరో సూర్యకు తమిళంలో పాటు తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉంది. ఐతే... ఇప్పటి వరకు తమిళ డబ్బింగ్ సినిమాలతో పలకరించిన సూర్య.. ఇపుడు బోయపాటి శ్రీను సినిమాతో మరోసారి తెలుగులో రీ ఎంట్రీ ఇస్తున్నారు. గతంలో సూర్య.. ‘రక్త చరిత్ర 2’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే కదా. (Twitter/Photo)
సత్యరాజ్ కూడా అపుడెపుడే శోభన్ బాబు హీరోగా నటించిన ‘ఇద్దరు కొడుకులు’ సినిమాతో తెలుగులో డైరెక్ట్ ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత చాలా యేళ్ల తర్వాత ‘శంఖం’ సినిమాతో తెలుగులో రీ ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత రాజమౌళి ‘బాహుబలి’లో కట్టప్పగా తెలుగు ప్రేక్షకులతో పాటు యావత్ భారత దేశ ప్రేక్షకులను అలరించిన సంగతి తెలిసిందే కదా. డైరెక్ట్‌గా హీరోగా చేయకపోయినా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా అలరిస్తున్నారు. (Twitter/Photo)