Happy Birthday Salman Khan | తన సినిమాలతో బాలీవుడ్ బాక్సాఫీస్‌కు కొత్త అర్థం చెప్పిన ‘సుల్తాన్’. బాక్సాఫీస్ రికార్డులే కాదు..అంత కన్నా వివాదాలతో వార్తల్లో నిలిచిన హీరో. అంతేకాదు ఎంతో మంది కథానాయికలతో ప్రేమాయణం నడిపిన సినీ ప్రేమికుడు. అంతేకాదు ఫ్లాప్ టాక్‌తో వందల కోట్లు వసూలు చేసే బాలీవుడ్ ‘ఏక్ థా టైగర్’. వివాదాలు, వినోదాలతో ఆడియన్స్ మది దోచుకున్న ఆ కథానాయకుడే సల్మాన్ ఖాన్. ఈరోజు 57వ ఏట అడుగుపెట్టాడు. ఆయన నట ప్రస్థానంపై చిన్న ఫోకస్..
తనదైన క్లాస్ మాస్ చిత్రాలతో ప్రేక్షకుల మదిని దోచిన సల్మాన్ ఖాన్..1965 డిసెంబర్ 27న మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో సలీమ్ ఖాన్, సుశీల చరక్ దంపతలకు జన్మించారు. తండ్రి బాలీవుడ్లో ఫేమస్ రైటర్. ఆయన ప్రోద్బలంతో 1988లో రేఖ ప్రధాన పాత్రలో నటించిన ‘బివి హోతో ఐసీ’ సినిమాతో నటుడిగా తెరంగేట్రం చేశారు. (Twitter/Photo)
ఆ తర్వాత 1989లో సూరజ్ ఆర్.బర్జాత్యా తెరకెక్కించిన ‘మైనే ప్యార్ కియా’ మూవీతో పూర్తి స్థాయి హీరోగా మారాడు. ‘మైనే ప్యార్ కియా’ మూవీ బాలీవుడ్ ప్రేమ కథా చిత్రాల్లో ఒక ట్రెండ్‌ను సెట్ చేసింది. ఈ మూవీతో సల్మాన్ ఖాన్..లవర్ బాయ్ ఇమేజ్‌తో ఓవర్ నైట్ స్టార్ హీరో అయిపోయారు. ఈ మూవీ తర్వాత సల్మాన్ ఇక వెనుదిరిగి చూసుకోలేదు.(File photo)
సల్మాన్ నటించిన ‘ప్రేమ్ రతన్ ధన్ పాయో’, ‘రేస్3’ వంటి సినిమాలు ఫ్లాప్ టాక్‌తో రూ.100 కోట్లు వసూలు చేయడం సల్మాన్ మాస్ ఫాలోయింగ్‌కు నిదర్శనం. అదే అమీర్ ఖాన్ నటించిన ‘థగ్స్ ఆఫ్ హిందోస్థాన్’, షారుఖ్ ‘జీరో’ మూవీలకు ఫ్లాప్ టాక్‌తో బాక్సాఫీస్ దగ్గర వంద కోట్లను వసూలు చేయలేక కిందామీద పడ్డాయి.(File/Photo)