Ajay Devgn : బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో హీరోగా, నిర్మాతగా, దర్శకుడిగా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో అజయ్ దేవ్‌గణ్. బాలీవుడ్లో ‘ఫూల్ ఔర్ కాంటే’ సినిమాతో సినీ ప్రస్థానం మొదలైంది. ఇప్పటికీ భోళాతో కంటిన్యూ అవుతూనే ఉంది. ఈ రోజు ఈ హీరో పుట్టినరోజు. ఈ సందర్భంగా బాలీవుడ్లో అమితాబ్ బచ్చన్ తర్వాత ఆ రికార్డును అందుకున్న హీరోగా సత్తా చాటారు.
‘ఫూల్ ఔర్ కాంటే’ తర్వాత అజయ్ దేవ్‌గణ్ హీరోగా తెరకెక్కిన ‘జిగర్’ సినిమా మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కింది. ఈ సినిమా కూడా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఇలా వరుసగా యాక్షన్ సినిమాలు చేస్తుండంటో అజయ్ దేవ్‌గణ్‌ను స్టంట్స్ తప్పించి యాక్షన్ రాదనే వాదన మొదలైంది. వారందరికీ తనదైన నటనతో సమాధానం ఇచ్చారు. (Twitter/Photo)
తొలిసారి అజయ్ దేవ్‌గణ్, కాజోల్ ‘హల్చల్’ సినిమాలో కలిసి నటించారు. 1995లో విడుదలైన ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. ఆ తర్వాత వీళ్లిద్దరు పలు చిత్రాల్లో నటించి ప్రేమ వివాహాం చేసుకున్నారు. పెళ్లైన తర్వాత పలు చిత్రాల్లో వీళ్లిద్దరు జోడిగా నటించడం విశేషం. చివరగా అజయ్ దేవ్‌గణ్ ఓం రౌత్ దర్శకత్వంలో చేసిన ‘తానాజీ’లో వీళ్లిద్దరు జోడిగా నటించడం విశేషం. (Twitter/Photo)
ఇక అజయ్ దేవ్‌గణ్ నటించిన ‘జక్మ్’, ‘ది లెజెండ్ ఆఫ్ భగత్ సింగ్’ , తానాజీ సినిమాలోని నటనకు గాను మూడు సార్లు జాతీయ ఉత్తమ నటుడు అవార్డు అందుకున్నారు. బాలీవుడ్లో అమితాబ్ బచ్చన్ 4 సార్లు జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకుంటే.. అజయ్ దేవ్‌గణ్ మూడు సార్లు అందుకొని రికార్డు క్రియేట్ చేసారు. (Twitter/Photo)
ఒక వైపు ‘సింగం’ అంటూ యాక్షన్ సినిమాలు చేస్తూనే మరోవైపు ‘గోల్మాల్’ సిరీస్‌తో తనలోని కామెడీని అందరికీ పరిచయం చేసారు. అటు ‘భూత్’ ‘కాల్’ అంటూ హార్రర్ సినిమాల్లో నటించారు. ‘తానాజీ’ అంటూ చారిత్రక ప్రాత్లలతో ఇలా నటుడిగా ఒక మూసకు పరిమితం కాకుండా విభిన్న పాత్రల్లో ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు. (Twitter/Photo)
గతేడాది ‘గంగుబాయి కతియావాడి, ఆర్ఆర్ఆర్, రన్ వే 34, థాంక్ గాడ్, దృశ్యం 2 వంటి చిత్రాల్లో నటిస్తే.. గంగుబాయి కతియావాడి, ఆర్ఆర్ఆర్, దృశ్యం 2 సినిమాలతో సక్సెస్ అందుకున్నారు. అందులో దృశ్యం 2 ఒక్కటే సోలో హిట్. బాలీవుడ్లో గత కొన్నేళ్లుగా రీమేక్‌తో హిట్ కొట్టిన హీరోగా రికార్డులకు ఎక్కారు. (Twitter/Photo)
తాజాగా అజయ్ దేవ్‌గణ్ పుట్టినరోజుకు మూడు రోజులు ముందు రిలీజైన ‘భోళా’తో మరో హిట్టును తన ఖాతాలో వేసుకున్నాడు. బాలీవుడ్లో వరుసగా రెండు రీమేక్ సినిమాలతో హిట్టు అందుకున్న మొనగాడుగా నిలిచాడు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర దుమ్ముదులుపుతోంది. త్వరలో మైదాన్, సింగం ఎగైన్ చిత్రాలతో పలకరించనున్నారు. మొత్తంగా ఈ రోజు బర్త్ డే జరుపుకుంటున్న అజయ్ దేవ్‌గణ్‌కు న్యూస్ 18 స్పెషల్ బర్త్ డే విషెస్ తెలియజేస్తోంది. (File/Photo)