అందానికి అర్థంగా కనిపించే ఐశ్వర్యరాయ్.. ఆమె అందాన్ని చూస్తే మనసులేని రోబోలు సైతం ఫిదా కావాల్సిందే. అందానికి అభినయం తోడైతే.. ఆమె పేరు ఐశ్వర్య రాయ్. తన అందంతో.. నటనతో ప్రపంచ వ్యాప్తంగా పేరు సంపాదించిన గొప్పనటి. మోడల్‌గా కెరియర్ ను ప్రారంభించి.. మిస్ వాల్డ్గా ఎంపికైంది. అటునుంచి.. భారతీయ వెండితెరపై వెలుగులు నింపింది. ఒక్క భారతదేశంలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఆమె అందానికి కోట్లాది అభిమానులున్నారు.
‘ఇరువర్’ చిత్రానికి మంచి టాక్ వచ్చినా...కమర్షియల్ సక్సెస్ కాలేదు. అదే ఏడాది హిందిలో బాబీడియోల్ హీరోగా వచ్చిన ‘ఔర్ ప్యార్ హోగయా’ చిత్రంతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా ఆశించిన విజయాన్ని నమోదు చేయలేకపోయింది. ఇక నటిగా ఆమె 3 వ చిత్రం ‘జీన్స్’. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీతో ఐశ్వర్య రాయ్ ఫస్ట్ సక్సెస్ అందుకుంది. ఈ సినిమాలో నటనకు సౌత్ ఫిలిం ఫేర్ బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు అందుకుంది.
స్కూల్ చదివే రోజుల్లోనే.. ఆమె ఫ్యామిలీ ముంబైకి షిఫ్ట్ అయ్యింది. అక్కడి జైహింద్ కాలేజ్ లో ఇంటర్మీడియేట్ ఫస్ట్ ఇయర్ చదివింది. టీనేజ్ లో ఉండగా.. క్లాసికల్ డాన్స్, మ్యూజిక్ లను నేర్చుకుంది ఐశ్వర్య. ఆమె ఫేవరేట్ సబ్జెక్ట్ జువాలజీ. మెడికల్ ఫీల్డ్ ను కెరియర్ గా ఎంచుకోవాలని ముందు ప్లాన్ చేసింది. (Twitter/Photo)
అందులో సక్సెస్ కాలేదు. దాంతో ఆర్కిటెక్చర్ ను సెలెక్ట్ చేసుకుంది. కానీ ఆ ఫీల్డ్ ను కూడా వదిలి.. మోడలింగ్ ను కెరియర్ గా ఎన్నుకొంది. ఐశ్వర్య నైన్త్ గ్రేడ్ లో ఉండగానే క్యామ్లిన్ పెన్సిల్ యాడ్ లో నటించింది. జైహింద్ కాలేజ్ ప్రొఫెసర్ ఆమె ఫొటోలు ఫ్యాషన్ మేగజైన్ కు ఇవ్వగా.. అవి పబ్లిష్ అయ్యాయి. (Twitter/Photo)
బాలీవుడ్2లో టాప్ హీరోయిన్గా రాణిస్తున్న సమయంలోనే నాగార్జున హీరోగా నటించిన ‘రావోయి చందమామ’ సినిమాలో ఒక పాటలో మెరవడం విశేషం. ‘బంటి ఔర్ బబ్లీ’ మూవీలో.. కజ్రారే.. పాటలో అమితాబ్, అబిషేక్ లతో కలిసి డాన్స్ చేసింది ఐశ్వర్య. అప్పటికి.. ఐశ్వర్య, అభిషేక్ ల మ్యారేజ్ జరగలేదు. సినిమాకంటే.. ఆ పాటకే ఎక్కువ హిట్ టాక్ వచ్చింది. ఆ రేంజ్ లో ఈ మెరుపుతీగ ఆడింది. ఆ తర్వాత ‘ధూమ్2’ లో ఐశ్వర్యా నటనకు మంచి మార్కులే పడ్డాయి. Photo : Twitter
ఐష్.. హాలీవుడ్‌లోనూ తన సత్తా చాటింది. ఇండియన్ మూవీల్లో నటిస్తూనే హాలీవుడ్‌లోనూ తన టాలెంట్ చూపింది. ‘బ్రైడ్ అండ్ ప్రెజుడీస్’ అనే హాలీవుడ్ మూవీలో ఐశ్వర్య యాక్ట్ చేసింది. 2004 లో రిలీజైన ఈ మూవీ ఒక రొమాంటిక్ మ్యూజికల్ డ్రామా. మార్టిన్ హెండర్సన్‌కు జోడీగా ఐశ్వర్య వండర్ఫుల్ పర్ఫామెన్స్ ఇచ్చింది. లలితా బక్షీ అనే ఇండియన్ గాళ్ రోల్లో యాష్ నటించింది. ఆ తర్వాత కొన్నిహాలీవుడ్ సినిమాల్లో ఐశ్వర్య రాయ్ నటించడం విశేషం. Photo : Twitter
2007 లో ఐశ్వర్య.. బచ్చన్ ఫ్యామిలీ మెంబరైంది. పెళ్లయినా కెరీర్ ను వదులుకోలేదు ఐష్. ఎన్నో జాతీయ, అంతర్జాతీయ అవార్డులు ఆమెను వరించాయి. ఫిలింఫేర్ బెస్ట్ యాక్ట్రెస్‌గా రెండుసార్లు ఎంపికైంది ఐశ్వర్య రాయ్. కళారంగంలో ఆమె చేసిన కృషికి.. కేంద్రం 2010లో ఆమెను పద్మశ్రీ అవార్డులో సత్కరించింది. Photo : Twitter