టాలీవుడ్ ప్రిన్స్‌గా ఎంట్రీ ఇచ్చి సూపర్‌స్టార్ ఎదిగారు మహేష్ బాబు. కృష్ణ వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన మహేష్, కొద్దికాలంలోనే తనదైన స్టైల్‌తో యూత్ ఫేవరెట్ హీరోగా మారారు. సింపుల్ స్మైల్‌తో అమ్మాయిల మనసు దోచేసే వయసు 47 ఏళ్లు అంటే నమ్మడం కష్టమే. 47 ఏళ్లలో నటుడిగా త్వరలో 43 ఏళ్లు కంప్లీట్ చేసుకోనున్నారు మహేష్ బాబు. హీరోగా 23 యేళ్ల నట ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్నారు.(Twitter/Photo)
అతని డైలాగ్స్షాట్ అండ్ షార్ప్ గా ఉంటాయి. హాలీవుడ్ హీరోలకు తీసిపోని హాండ్సమ్ పర్సనాలిటీ మహేష్ బాబు సొంతం. అమ్మాయిలా కలల రాజకుమారుడు. మైండ్‌లో ఫిక్స్ అయితే బ్లైండ్ గా దూసుకెళ్లే సైనికుడు. నీ దూకుడు సాటి ఎవ్వడు అంటూ సరిలేరు నీకెవ్వరు అంటూ ఇపుడు సర్కారు వారి పాటతో త్వరలో ప్రేక్షకులను పలకరించబోతున్నారు. (Twitter/Photo)
1979లో విడుదలైన ‘నీడ’ సినిమాలో చిన్న పాత్రలో కనిపించిన మహేష్ బాబు... ఆ తర్వాత చైల్డ్ ఆర్టిస్ట్‌గా తండ్రి కృష్ణ నటించిన కొన్ని సినిమాల్లో నటించిన విషయం తెలిసిందే. ‘రాజకుమారుడు’ సినిమాతో హీరోగా సోలో ఎంట్రీ ఇచ్చిన మహేష్... ‘మురారి’ సినిమాతో మంచి నటుడిగా విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ఇపుడు టాలీవుడ్ టాప్ సూపర్ స్టార్‌గా ఎదిగారు.ఇక మహేష్ బాబు మొత్తంగా తండ్రి సూపర్ స్టార్ కృష్ణతో పదిసార్లు స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. (Twitter/Photo)
మహేష్ లోని నటుడిని వెలికితీసిన సినిమా మురారి. కృష్ణవంశీ డైరెక్షన్ లో చేసిన ఈ మూవీతో మహేష్ బంపర్ హిట్ కొట్టాడు. ఈ చిత్రంతో మహేష్ కు అటు యూత్ లోను ఇటు లేడీస్ లో మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. ఈ సినిమాలో మహేష్ నటనకు విమర్శకుల ప్రశంసలు లభించాయి. ఈ సినిమా విజయంతో మహేష్ ఇక వెనుతిరిగి చూసుకోలేదు. (Twitter/Photo)
అందరి హీరోల్లా రొటీన్ గానటించడం మహేష్ అస్సలు నచ్చదు. తండ్రి కృష్ణలాగే మహేష్ డేరింగ్ డాషింగ్. ఆ రూట్లోనే మహేష్ చేసిన కౌబాయ్ చిత్రం టక్కరిదొంగ. ఈ సినిమా టెక్నికల్ గా బాగా రిచ్ గా ఉన్నా...కథనం స్లోగా ఉండటంతో ఈ సినిమా సరైన సక్సెస్ సాధించలేదు. అయినా ఈ మూవీలో మహేష్ నటనకు.. నంది స్పెషల్ జ్యూరీ అవార్డు కైవసం చేసుకున్నాడు. (Twitter/Photo)
ఒక్కడు సక్సెస్ తర్వాత మహేష్ చేసిన మూవీ నిజం. అవినీతి పై పోరాడే యువకుడిగా మహేష్ నటన ఆకట్టుకుంటుంది. ఈ మూవీతో మహేష్ తొలిసారి ఉత్తమ నటుడిగా నంది అవార్డు అందుకున్నాడు. ఈ సినిమా తర్వాత మహేష్ చేసిన మరో ప్రయోగం నాని. ఈ సినిమా కాన్సెప్ట్ బాగున్న ఇక్కడి ఆడియన్స్ కు కనెక్ట్ కాలేకపోయింది. ఈ సినిమాలో మహేష్ లోని నటున్నివిభిన్నకోణంలో ఆవిష్కరించింది. (Twitter/Photo)
హీరోగా సాఫ్ట్ రోల్సే కాదు అన్నిరకాల పాత్రలు పోషించి మెప్పించగలనని ‘అతడు’ మూవీతో నిరూపించాడు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మహేష్ తో పలికించిన డైలాగులు ఆడియన్స్ కు మెస్మరైజ్ చేశాయి. స్వతహాగా మంచి వాడైనా...పరిస్థితుల వలన ప్రొఫెషనల్ కిల్లర్ గా మారుతాడు. ఈ సినిమాలో ప్రిన్స్ పలికిన ఎక్స్ ప్రెషన్స్ ఈ మూవీ విజయానికి పెద్ద ఎస్సెట్ గా నిలిచాయి. ఈ సినిమాలో నటకు రెండోసారి నంది అవార్డు అందుకున్నాడు మహేష్ బాబు. (Twitter/Photo)
ఎవడు కొడితే దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే పండుగాడు. ఈ డైలాగ్ తో హోల్ ఏపి మహేష్ మేనిలోకి జారుకుంది. పూరి సంభాషణలకు ప్రిన్స్ పలికిన డైలాగులు బాగా పేలాయి. ఈ సినిమా అప్పటి వరకు తెలుగు సినిమా బాక్సాఫీసు రికార్డలన్నిటిని ఈజీగా క్రాస్ చేసింది. ఇక మహేష్ కెరీర్ చెప్పాలంటే పోకిరి కి ముందు పోకిరి తర్వాత అనేంతగా మారిపోయింది. ఈ సినిమాతో పండుగాడు సూపర్ స్టార్ గా ఎదిగాడు. (Mahesh Babu Puri jagannadh)
పోకిరిలో మహేష్ నోటి నుంచే మాటలు తూటాలై పేలాయి. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను. నేను ఎంత ఎదవనో నాకే తెలియదు లాంటి డైలాగులతో సూపర్ స్టార్ నటన ఆల్ టైప్ ఆఫ్ ఆడియన్స ను అట్రాక్ట్ చేయగలిగింది. ఎవడు కొడితే దిమ్మతిరిగేలా బాక్సాఫీసు రికార్డ్స్ షేక్ అవుతాయో వాడే మహేష్ బాబు. దక్షిణ భారత చలనచిత్ర చరిత్రలో అత్యధిక కలెక్షన్స్ సాధించిన చిత్రంగా రికార్డులకెక్కి మహేష్ స్టామినా ఏంటో తెలియజేసింది.తాాజగా మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా ఈ సినిమాను మరోసారి రిలీజ్ చేస్తే టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడు పోయాయి. (Twitter/Photo)
శ్రీను వైట్ల డైరెక్షన్ లో చేసిన దూకుడు మహేశ్ కెరీర్ లోనే భారీ విజయంగా నిలబడింది. మహేశ్ నటనకు తమన్ సంగీతం ఈ చిత్రాన్ని మ్యూజికల్ హిట్ గా నిలబెట్టింది. మైండ్‌లో ఫిక్సయితే బ్లైండ్ గా దూసుకుపోతా లాంటి డైలాగులతో పాటు... మహేశ్ పండించిన యాక్షన్ ప్లస్ కామెడీ టైమింగ్ ఈ చిత్రాన్ని హిట్ గా నిలబెట్టింది. (Twitter/Photo)
అంతేకాకుండా తన నటనకు ఏడు నంది అవార్డులు అందుకున్న మహేష్... ప్రస్తుత తరంలో అత్యధిక నంది అవార్డులు సొంతం చేసుకున్న హీరోగానూ రికార్డు క్రియేట్ చేశారు. బాల నటుడిగా 9 సినిమాల్లో నటించిన మహేష్ బాబు.. హీరోగా 27 చిత్రాల్లోనటించారు. మొత్తంగా 43 ఏళ్ల కెరీర్లో 36 చిత్రాల్లో ప్రేక్షకులను అలరించారు మహేష్ బాబు. (Twitter/Photo)
తెలుగు హీరోలు కేవలం నటన మాత్రమే కాదు బిజినెస్ చేయడంలోనూ ఆరితేరిపోయారు. ముఖ్యంగా నటనతో పాటే ఇతర రంగాల్లోనూ సత్తా చూపిస్తున్నారు. అందులో అందరికంటే ముందున్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. ఈయన కేవలం సినిమాలు మాత్రమే కాదు.. వ్యాపారాలు చేయడంలో కూడా ముందున్నారు. సినిమాలతో పాటు మరోవైపు నిర్మాణ వ్యవహారాలతో పాటు వ్యాపారాలతో ఫుల్ బిజీగా ఉన్నారు.
త్రివిక్రమ్ మూవీ తర్వాత మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమాను ఇండియానా జోన్స్ తరహా జానర్లో తెరకెక్కించబోతున్నట్టు జక్కన్న నాయనా విజయేంద్ర ప్రసాద్ పలు ఇంటర్వ్యూల్లో ప్రస్తావించారు. ఈ కాంబినేషన్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా దసరా కానుకగా పూజా కార్యక్రమాలతో ప్రారంభమై వచ్చే యేడాది సెట్స్ పైకి వెళ్లనుంది. Mahesh Babu Twitter