ఇక దర్శకుడు ప్రశాంత్ వర్మ విషయానికి వస్తే.. తన తొలి సినిమా ‘అ’ తోనే అందరినీ ఆకట్టుకున్నారు. అంతేకాదు ఈ సినిమాకు జాతీయ అవార్డు సైతం అందుకున్నారు ప్రశాంత్ వర్మ. తన ఆ సినిమాలో కాజల్ అగర్వాల్(Kajal Aggarwal) ప్రధాన పాత్ర పోషించారు. నాని నిర్మాణంలో వచ్చిన ఈ చిత్రానికి సీక్వెల్ కూడా తీయనున్నట్లు ప్రశాంత్ వర్మ అప్పట్లో తెలియజేసారు. (Twitter/Photo)
ప్రశాంత్ వర్మ, తేజ సజ్జ కాంబినేషన్లో.. ’జాంబీ రెడ్డి’ సినిమా తెరకెక్కించారు. ఈ చిత్రంలో తేజ సజ్జ హీరోగా దక్ష నగార్కర్, (Daksha Nagarkar) ఆనందీ హీరోయిన్స్‌గా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితాన్ని అందుకుంది.కరోనాను బ్యాగ్ గ్రౌండ్లో తీసుకుని జాంబీ రెడ్డి (Zombie Reddy) సినిమాను తెరకెక్కించారు ప్రశాంత్ వర్మ. రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యం కూడా జోడించడంతో సినిమాలో నవ్వులు పువ్వులు పూసాయి. కామెడీ ఓ రేంజ్లో పేలింది. ఈ సినిమా థ్రిల్లర్ జానర్లో వచ్చిన అందులోనే కామెడీ కూడా వర్కవుట్ చేయడంతో జనాలను బాగానే ఎంజాయ్ చేశారు. ఈ సినిమా దాదాపు రూ.15 కోట్ల షేర్ రాబట్టి సూపర్ హిట్‌గా నిలిచింది. త్వరలో రానున్న ‘హనుమాన్’ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందా అనేది చూడాలి. (Twitter/Photo)