Hansika Motwani: దేశముదురు సినిమాతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను దోచుకున్న ముద్దుగుమ్మ హన్సిక. ఈ సినిమా తర్వాత పలు సినిమాలలో నటించి ఇండస్ట్రీకి దూరమైంది. ఆ తర్వాత 2019లో ఎంట్రీ ఇచ్చింది. ఇక ప్రస్తుతం పలు సినిమాలలో బిజీగా ఉంది. ఇదిలా ఉంటే కేవలం నటిగానే కాకుండా వ్యక్తిగతంగా మంచి పేరు సంపాదించుకుంది. తాజాగా తన పుట్టినరోజు సందర్భంగా.. క్యాన్సర్ తో బాధపడుతున్న 10 మంది చిన్నారులను దత్తత తీసుకుంది. వారు కోలుకునే వరకు ఖర్చు మొత్తం భరిస్తానని తెలిపింది. చెన్నైకి వెళ్ళినప్పుడు అనాథాశ్రమాలకు అన్నదానం చేస్తానని కూడా తెలిపింది హన్సిక.