జైపూర్‌లోని 400ఏళ్ల క్రితం నిర్మించిన రాజకోటలో ముంబై లేడీ హన్సికా మోత్వానీ మ్యారేజ్ సెలబ్రేషన్స్ జరిగాయి. ముందుగా గులాబీలతో అలంకరించిన పల్లకిపై పెళ్లికూతురు అలంకారంలో వివాహ వేదికకు వచ్చిన హన్సిక మెడలో పూల దండ వేసి నుదుటన సింధూరం పెట్టి తన పెళ్లి చేసుకున్నాడు. సోహైల్ సింధూరం పెడుతున్న వేళ హన్సిక ఎమోషనల్ అయ్యింది.
కొత్తగా పెళ్లి చేసుకున్న హన్సిక, సోహైల్ కపుల్స్‌ని పల్లకిపై ఊరేగిస్తూ డ్యాన్స్‌లు చేశారు కుటుంబ సభ్యులు, బంధు, మిత్రులు. హన్సిక పెళ్లి వేడుకలు గత పది రోజుల క్రితమే ప్రారంభమయ్యాయి. ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ నుంచి హల్దీ, మెహందీ, సంగీత్ వేడుకలు హన్సికా పెళ్లి ముగిసే వరకూ ఒక్కో వేడుక పండగలా నిర్వహించారు.