Hansika Motwani: హన్సిక పెళ్లి ఖర్చు ఎన్ని కోట్లో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే...!
Hansika Motwani: హన్సిక పెళ్లి ఖర్చు ఎన్ని కోట్లో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే...!
సౌత్, బాలీవుడ్ సినిమాల్లో ఓ వెలుగు వెలిగిన హీరోయిన్ హన్సిక మోత్వానీ వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది. ఆమె డిసెంబర్ 4న ప్రియుడు మరియు వ్యాపారవేత్త సోహైల్ ఖతురియాను వివాహం చేసుకుంది. అయితే ఇప్పుడు తాజాాగా హన్సిక పెళ్లికి ఎంత ఖర్చు పెట్టింది అన్నది ఇప్పుడు వైరల్ అవుతోంది.
టాలీవుడ్ హీరోయిన్ హన్సికా మోత్వాని(Hansika Motwani), సోహైల్(Sohail)పెళ్లి వైభవంగా జరిగింది. ఆచార సంప్రాదాయాలతో జరిగిన పెళ్లితో ఈ జంట వివాహ బంధంతో ఒక్కటైంది. ప్రముఖ ప్యాలెస్‌లో వీరి వివామ: అంగరంగ వైభవంగా జరిగింది.
2/ 8
ముంబై(Mumbai)కి చెందిన వ్యాపారవేత్త సోహైల్ కథారియా(Sohail Katharia)ను ప్రేమించిన దేశముదురు హీరోయిన్ హన్సిక జైపూర్(Jaipur)లోని రాజకోటలో అంగరంగ వైభవంగా వివాహం చేసుకుంది. కుటుంబ సభ్యులు, ఆత్మీయుల సమక్షంలో ఈ స్టార్ కపుల్ ఒక్కటయ్యారు. అయితే ఇప్పుడు హన్సిక పెళ్లి ఖర్చు వైరల్ అవుతోంది.
3/ 8
అయితే వీరిద్దరి వివాహం మూడు రోజుల ముందు నుంచే చాలా అంగరంగ వైభవంగా ఏర్పాట్లు జరిగాయని వార్తలు కోలీవుడ్ మీడియాలో బాగా వైరల్ గా మారుతున్నాయి., హల్దీ, సంగీత్, మెహందీ ఫంక్షన్లు కూడా గ్రాండ్‌గా నిర్వహించారు.
4/ 8
హన్సిక తన వివాహం కోసం ఎంత ఖర్చు చేసింది అనే విషయంపై అభిమానులు ఆరా తీయగా.. ఈ క్రమంలోనే హన్సిక పెళ్లి కోసం దాదాపుగా రూ. 20 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేసింది అని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి.
5/ 8
సింధీ సంప్రదాయం ప్రకారం హన్సిహా, సోహైల్‌ల వివాహ వేడుక జరిగింది. కుటుంబ సభ్యులు, సన్నిహితులు మాత్రమే పాల్గొన్నారు.నటికి ఇది మొదటి వివాహం కావచ్చు. అయితే సోహైల్‌కి ఇది రెండో పెళ్లి. అతని మొదటి భార్య పేరు రింకే బజాజ్. హన్సికను రెండో పెళ్లి చేసుకున్నాడు.
6/ 8
అయితే అంత ఖర్చు పెట్టి హన్సిక పెళ్లి చేసుకుందా అని నెటిజన్లు, ఆమె అభిమానులు ఆశ్యర్యపోతున్నారు. మరి ఈ వార్తల్లో ఎంత నిజం ఉందో తెలియాల్సి ఉంది. మరోవైపు సోహైల్‌కు ఇది రెండో పెళ్లి కావడంతో హన్సికను ట్రోల్ చేస్తున్నారు.
7/ 8
హన్సిక పెళ్లి చీర కొత్తదే.. కానీ.. భర్త మాత్రం పాతవాడు అంటూ పలువురు ఆమెపై ట్రోలింగ్ చేస్తున్నారు. మరోవైపు నటి తన ప్రీ వెడ్డింగ్ ఈవెంట్స్ ఫోటోలను షేర్ చేసింది మరియు ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. నటి ఇంకా పెద్దగా పెళ్లి ఫోటోలను పోస్ట్ చేయలేదు.
8/ 8
ప్రియురాలి జీవితాన్ని నాశనం చేసి తన భర్తను పెళ్లి చేసుకున్నారంటూ పలువురు నటిని ట్రోల్ చేశారు. అయితే సోహైల్ హన్సికతో ప్రేమ పెళ్లికి ముందే విడాకులు తీసుకున్నాడు.