టాలీవుడ్ హీరోయిన్ హన్సికా మోత్వాని(Hansika Motwani), పోయిన యేడాది డిసెంబర్ 4న పెళ్లి చేసుకుంది. సోహైల్(Sohail)పెళ్లి వైభవంగా జరిగింది. ఆచార సంప్రాదాయాలతో జరిగిన పెళ్లితో ఈ జంట వివాహ బంధంతో ఒక్కటైంది. ప్రముఖ ప్యాలెస్‌లో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు మాత్రమే ఈ పెళ్లికి విచ్చేశారు. Photo : Instagram
ముంబై(Mumbai)కి చెందిన వ్యాపారవేత్త సోహైల్ కథారియా(Sohail Katharia)ను ప్రేమించిన దేశముదురు హీరోయిన్ హన్సిక జైపూర్(Jaipur)లోని రాజకోటలో అంగరంగ వైభవంగా వివాహం చేసుకుంది. కుటుంబ సభ్యులు, ఆత్మీయుల సమక్షంలో ఈ స్టార్ కపుల్ ఒక్కటయ్యారు. హన్సిక పెళ్లికి సంబంధించిన అనేక అంశాలు తెరపైకి వస్తున్నాయి. Photo : Instagram
అయితే హన్సికను ఈ గోల్డెన్ కలర్ లెహంగాలో చూసిన అభిమానులు.. ఓల్డ్ రోజులకు తీసుకెళ్లిందంటూ కామెంట్లు చేశారు. మిర్రర్ వర్క్ చేసిన షరారా సెట్ మరియు వెండి టిష్యూ ఆర్గాన్జాతో చేసిన దుపట్టాలో డ్రాప్-డెడ్ చాలా అందంగా ఉంది. బరువైన నెక్‌పీస్, రెండు మాంగ్ టిక్కాస్ మరియు ఝుమ్కా చెవిపోగులతో హన్సిక ఎంతో అందంగా ఆకట్టుకుంటుంది. అయితే హన్సిక వేసుకున్న ఈ షరారా ఖరీదు రూ. 3 లక్షలు అని సమాచారం. ఆమె వేసుకున్న డ్రెస్సుకు సూట్ అయ్యేలాగే.. వరుడు సోహౌల్ కథారియా కూడా అలాంటి మిర్రర్ వర్క్‌తో కూడిన ఐవరీ షెర్వాణీ ధరించాడు Photo : Instagram
వీరిద్దరి వివాహం మూడు రోజుల ముందు నుంచే చాలా అంగరంగ వైభవంగా ఏర్పాట్లు జరిగాయని వార్తలు కోలీవుడ్ మీడియాలో బాగా వైరల్ గా మారుతున్నాయి., హల్దీ, సంగీత్, మెహందీ ఫంక్షన్లు కూడా గ్రాండ్‌గా నిర్వహించారు. హన్సిక తన వివాహం కోసం ఎంత ఖర్చు చేసింది అనే విషయంపై అభిమానులు ఆరా తీయగా.. ఈ క్రమంలోనే హన్సిక పెళ్లి కోసం దాదాపుగా రూ. 20 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేసింది అని వార్తలు వినిపించాయి. Photo : Instagram
హన్సికను తెలుగు ప్రేక్షకులు దాదాపు మరిచిపోయారు. అప్పుడెప్పుడో మంచు విష్ణుతో లక్కున్నోడు సినిమా తర్వాత తెలుగులో కనిపించలేదు హన్సిక. పూర్తిగా తమిళ ఇండస్ట్రీకే పరిమితం అయిపోయింది. దాంతో పాటు హిందీలోనూ అవకాశాల కోసం చూస్తుంది హన్సిక. అక్కడ కూడా అరకొర ఛాన్సులే వస్తున్నాయి అయినా కూడా ఫిజిక్ కాపాడుకుంటూ తనదైన రోజు కోసం చూస్తుంది హన్సిక. Photo : Instagram
పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘దేశ ముదురు’ సినిమాతో హీరోయిన్గా పరిచయం అయిన హన్సిక మోత్వానీ. హన్సిక పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు హీరోయిన్గా దాదాపు 50 పైగా చిత్రాల్లో హీరోయిన్గా నటించిన హన్సిక మోత్వానీ. 2007 నుంచి అప్రతహతంగా కొనసాగుతున్న హన్సిక ఫిల్మీ కెరీర్.హీరోయిన్గా 15 యేళ్ల కెరీర్ పూర్తి చేసుకుంది హన్సిక. Photo : Instagram