దేశముదురు భామ పెళ్లి పీటలెక్కుతోంది. మరికొన్నిగంటల్లో హన్సిక పెళ్లి జరగనుంది. సోహైల్‌తో గ్రాండ్‌గా జరుగుతున్న తన వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌కి అతి తక్కువ మందిని ఆహ్వానించింది హన్సికా మోత్వాని.
టాలీవుడ్ హీరోయిన్ హన్సికా మోత్వాని(Hansika Motwani), సోహైల్(Sohail)పెళ్లికి అంతా రెడీ అయిపోయింది. మరికొన్ని గంటల్లో ఈ జంట వివాహ బంధంతో ఒక్కటి కానుంది.
2/ 7
గురువారం రాజస్థాన్‌లో ప్రీ వెడ్డింగ్ కార్యక్రమాలు జరిగాయి. మెహందీ వేడుక తర్వాత మరుసటి రోజు నైట్ సంగీత్ కూడా జరిగింది.
3/ 7
నటి హన్సిక సంగీత్ కార్యక్రమాన్ని కుటుంబం మరియు స్నేహితులతో శనివారం జరుపుకుంది. వరుడితో కలిసి గ్రాండ్ డ్యాన్స్ కూడా చేసింది.
4/ 7
అయితే ఈ సంగీత్‌కు సంబంధించిన పలు ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. నటి పింక్ లెహంగా ధరించింది.
5/ 7
హన్సిక అతనితో కలిసి కొన్ని రొమాంటిక్ పాటలకు స్టెప్పులేసింది. తన కాబోయే భర్తతో హన్సిక చాలా సంతోషంగా కనిపించింది.
6/ 7
అరశిన శాస్త్ర కార్యక్రమంలో నటి హన్సిక తెల్లటి దుస్తుల్లో కనిపించింది. ఈ ఫోటోలో నటి చేతులకున్న గోరింటాకును కూడా చూడవచ్చు.
7/ 7
డిసెంబర్ 4న జైపూర్ సమీపంలోని ముండోటా ఫోర్ట్ అండ్ ప్యాలెస్‌లో హన్సిక మోత్వాని, సోహైల్ ఖతురియా వివాహం జరగనుంది. ఈ జంట సింధీ సంప్రదాయ వేడుకలో పెళ్లి చేసుకోనున్నారు.