హన్సిక మళ్లీ అతడికి దగ్గరైందా...

కోలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా మంచి రేసులో ఉంది అందాల భామ హన్సిక. వరుసగా సినిమాలు చేస్తున్న హన్సిక తాజాగా మళ్ళీ తన ప్రియుడితో కలిసిపోయింది అనే న్యూస్ వైరల్ గా మారింది. దానికి కారణం హన్సిక కీ రోల్ లో మహా అనే సినిమా చేస్తుంది. ఈ సినిమాలో హీరోగా శింబుని ఎంపిక చేశారు. హన్సిక ఒప్పుకోకుంటే అసలు ఈ సినిమాలో శింబు ఎలా నటిస్తాడనే టాక్ జోరందుకుంది. పైగా హన్సిక, శింబు కలిసి ఈ మధ్యే ఓ పార్టీలో కలిసి కనిపించారనే పుకార్లు కూడా షికారు చేస్తున్నాయి. మరి... హన్సిక నిజంగానే తన మాజీ ప్రియుడితో మళ్లీ లవ్ స్టోరీ మొదలుపెట్టిందా లేదా అన్నది తెలియాలంటే మరికొంతకాలం వెయిట్ చేయాల్సిందే.