హన్సిక మళ్లీ ఆ హీరో బుట్టలో పడిపోయిందా...

ప్రేమించుకుని విడిపోయిన హీరో హీరోయిన్లు మళ్లీ ఫ్రెండ్స్‌గా మారడం అంత ఈజీకాదు. అలాంటి వాళ్లు కనీసం ఒకరికొకరు ఎదురుపడినా మాట్లాడుకోని సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కానీ ఈ విషయంలో హన్సిక పూర్తిగా భిన్నంగా వ్యవహరిస్తోంది. గతంలో హీరో శింబుతో ప్రేమాయణం సాగించిన ఈ ముద్దుగుమ్మ... ఆ తరువాత అతడి నుంచి విడిపోయింది. అయితే తాజాగా హన్సిక సినిమాలో శింబు గెస్ట్ రోల్ పోషించడంతో మళ్లీ వీరి మధ్య ఏదో మొదలైందనే టాక్ వినిపించింది. అయితే లాక్‌డౌన్ కారణంగా ఖాళీగా ఉన్న హన్సిక తాజాగా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో టచ్‌లోకి వచ్చింది. ఈ సందర్భంగా చాలామంది శింబు గురించే హన్సికను ప్రశ్నించారు. మొదట్లో ఈ ప్రశ్నలను హన్సిక పట్టించుకోలేదు. అయితే వరుసగా అవే ప్రశ్నలు వస్తుండడంతో సమాధానం చెప్పక తప్పలేదు. మాజీ ప్రేమికులు స్నేహితులుగా ఉండకూడదా ? మేమిద్దరం ఇప్పుడు మంచి స్నేహితులం.. అంతే అంటూ ఆన్సర్ ఇచ్చింది. ఏమో ఏదో ఒక రోజు స్నేహితులం మళ్లీ ప్రేమికులం అయ్యామని హన్సిక అంటుందేమో అనే సెటైర్లు కూడా వినిపిస్తున్నాయి.