Hamsa Nandini : ప్రముఖ హీరోయిన్ హంసా నందిని క్యాన్సర్ బారిన పడింది. ఈ విషయాన్ని ఈమె స్వయంగా తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా తెలియజేసింది. ఈ సందర్భంగా గుండుతో ఉన్న తన పిక్‌ను షేర్ చేసింది. హంసా నందికి బ్రెస్ట్ క్యాన్సర్ సోకిందట. ప్రస్తుతం హంసా నందిని నిపుణులైన డాక్టర్ల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటోంది. హంసాకు క్యాన్సర్ అని తెలియగానే అభిమానులు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. ఆమె త్వరగా కోలుకోవాలంటూ సామాజిక మాధ్యమాల ద్వారా అభిమానులు ఆమెకు అండగా నిలుస్తున్నారు. (Twitter/Photo)
సరిగ్గా 18 యేళ్ల క్రితం తన తల్లి కూడా బ్రెస్ట్ క్యాన్సర్‌తో కన్నుమూసిన విషయాన్ని ఈ సందర్బంగా గుర్తు చేసుకుంది. కానీ తాను ఈ క్యాన్సర్ మహామ్మారిని జయిస్తాననే నమ్మకం తనకు ఉందన్నారు. ప్రస్తుతం హంసా కీమో థెరపీ తీసుకుంటోంది. అందులో 9 సైకిల్స్ పూర్తయ్యాయి. మరో 7 సైకిల్స్ ఉన్నాయట. ఈ చికిత్స తర్వాత హంసా నందిని క్యాన్సర్ నుంచి పూర్తిగా కోలుకోవచ్చు. (Instagram/Photo)
ఇక బాలకృష్ణ హీరోగా నటించిన ‘లెజెండ్’లో ఐటెం సాంగ్‌తో ఎన్టీఆర్ జైలవకుశలో ముఖ్య పాత్రలో మెరిసింది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్‌గా ఉండే హంసా నందిని తన ఫోటోస్‌ను ఎప్పటి కప్పుడూ పోస్ట్ చేస్తూ ఉంటుంది. ప్రస్తుతం అందులో కొన్ని ఫోటోస్ వైరల్‌గా మారాయి. తాజాాగా ఈమె తనకు క్యాన్సర్ సోకిన విషయాన్ని సామాజిక మాధ్యమ వేదికగా ప్రపంచానికి తెలియజేసింది. (Instagram/Photo)