యువీ క్రియేషన్స్ ఆఫీస్ లో జీఎస్టీ నిఘా విభాగం సోదాలు నిర్వహించడం టాలీవుడ్ వర్గాల్లో తీవ్ర కలకలాన్ని సృష్టించింది. యువీ క్రియేషన్స్ సంస్థకు వస్తున్న ఆదాయానికి చెల్లిస్తున్న జీఎస్టీ లెక్కలకు చాలా వ్యత్యాసం వుందని జీఎస్టీ నిఘా విభాగం అధికారులు ఆరోపిస్తన్నట్లు సమాచారం. తాజాగా యువీ క్రియేషన్స్ ఆఫీస్ లో జరిపిన సోదాల్లో నిర్ధారణకు వచ్చారని తెలిసింది.
ఈ సంస్థ ప్రభాస్ నటించిన 'సాహో' రాధేశ్యామ్ సినిమాలకు 200 నుంచి 300 కోట్ల మేర ఖర్చు చేసినట్టుగా తెలుస్తోంది. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయి విజయాన్ని సొంతం చేసుకోని విషయం తెలిసిందే. రాదేశ్యామ్ సినిమాను యువీ క్రియేషన్స్, గోపీకృష్ణ మూవీస్ బ్యానర్స్‌పై ఈ సినిమాను 175 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు.
హీరో ప్రభాస్ వరుసకు సోదరుడైన ప్రమోద్ ఉప్పలపాటి ఆయన స్నేహితులు వంశీకృష్ణారెడ్డి, విక్రమ్ కృష్ణారెడ్డితో కలిసి ముంబై బేస్ తో 2013లో స్థాపించారు. ఈ సంస్థ ప్రభాస్ హీరోగా మిర్చి అనే సినిమా తీశారు. ఆ తర్వాత నాని హీరోగా భలే భలే మగాడివోయ్, శర్వానంద్ హీరోగా ఎక్స్ ప్రెస్ రాజా, రన్ రాజా రన్, మహానుభావుడు, గోపీచంద్ హీరోగా జిల్, పక్కా కమర్షియల్ వంటి సినిమాలు తీశారు. Prabhas Aidpurush Twitter