తాజాగా ఇద్దరు పెళ్ళాల ముద్దుల మొగుడి పిక్ ని తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేస్తూ ఆసక్తికరంగా స్పందించింది నటి కస్తూరి. ''ఫ్యామిలీ, ఫ్రెండ్స్ సమక్షంలో కవలలు ఇద్దరూ కూడా ఓ వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు. అయితే నేను లాయర్ కాబట్టి ఇలాంటి పెళ్లి నేరమని చెబుతా. బట్ ఐపీసీ సెక్షన్ ప్రకారం ఇది నేరం కానీ ముస్లింలకు ఇది వర్తించదు అని పేర్కొంది కస్తూరి.
స్వతాహాగా కస్తూరీ న్యాయవాది కావడంతో సమాజంలో జరుగుతున్న పలు అంశాలపై స్పందిస్తూ వస్తోంది. గతంలో కూడా సరోగసీ విధానంపై కస్తూరి రియాక్ట్ అయిన తీరు హాట్ టాపిక్ అయింది. ఇండియాలో సరోగసిని బ్యాన్ చేశారు.. క్రిటికల్ హెల్త్ ఇష్యూస్ ఉంటే తప్ప సరోగసికి వెళ్ళడానికి వీల్లేదు. ఈ చట్ట 2022 జనవరి నుంచి అమల్లో ఉంది అని ఆమె చెప్పింది.