Kasthuri: అనసూయను అందుకే ఆంటీ అంటున్నారు.. గృహలక్ష్మి ఫేమ్ కస్తూరి షాకింగ్ కామెంట్స్
Kasthuri: అనసూయను అందుకే ఆంటీ అంటున్నారు.. గృహలక్ష్మి ఫేమ్ కస్తూరి షాకింగ్ కామెంట్స్
Anchor Anasuya: సోషల్ మీడియాలో యమ యాక్టివ్ రోల్ పోషిస్తుంది యాంకర్ అనసూయ. అయితే ఈ బ్యూటీకి ట్రోలింగ్ అనుభవం చాలా సార్లు ఎదురైంది. ఆంటీ అంటూ అనసూయపై చేసిన కామెంట్లు వైరల్ అయ్యాయి. తాజాగా ఇదే ఇష్యూపై సీనియర్ నటి, గృహలక్ష్మి ఫేమ్ కస్తూరి రియాక్ట్ అయింది.
సోషల్ మీడియాలో యమ యాక్టివ్ రోల్ పోషిస్తుంది యాంకర్ అనసూయ. అయితే ఈ బ్యూటీకి ట్రోలింగ్ అనుభవం చాలా సార్లు ఎదురైంది. ఆంటీ అంటూ అనసూయపై చేసిన కామెంట్లు వైరల్ అయ్యాయి. తాజాగా ఇదే ఇష్యూపై సీనియర్ నటి, గృహలక్ష్మి ఫేమ్ కస్తూరి రియాక్ట్ అయింది.
2/ 9
అన్నమయ్య, భారతీయుడు లాంటి సినిమాలతో యువత మనసు దోచుకుంది కస్తూరి. ఒకానొక సమయంలో వెండితెరపై తన మార్క్ చూపించిన ఈ హీరోయిన్.. ఇప్పుడు బుల్లితెపై రాణిస్తోంది. గృహలక్ష్మి సీరియల్ తో ప్రతి ఇంట సందడి చేస్తోంది కస్తూరి.
3/ 9
అయితే నిత్యం సమాజంలోని వివాదాలు, సమస్యలు, విషయాలపై స్పందిస్తూ వార్తల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతూ ఉంటుంది కస్తూరి. సామాజికవేత్తగా, న్యాయవాదిగా, పొలిటికల్ అనలిస్ట్‌గా నెట్టింట్లో రచ్చ చేస్తూ తరచూ ఏదో ఒక ఇష్యూపై రియాక్ట్ అవుతూ ఉంటుంది.
4/ 9
ఈ నేపథ్యంలోనే తాజాగా అనసూయను ఆంటీ అంటూ ట్రోల్ చేసే వారి విషయమై షాకింగ్ కామెంట్స్ చేసింది కస్తూరి. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన కస్తూరి సంచలన విషయాలపై స్పందించింది. నెటిజన్స్ చేస్తున్న ట్రోల్స్ పై తనదైన స్టైల్ లో రియాక్ట్ అయింది.
5/ 9
మిమ్మల్ని ఎవరైనా ఆంటీ అని పిలిస్తే ఎలా స్పందిస్తారు అని ఇంటర్వ్యూయర్ అడగడంతో వెంటనే స్పందించిన ఆమె.. మమల్ని చిన్న పిల్లలు ఆంటీ అని పిలవడానికి, పెద్దవాళ్ళు పిలవడానికి చాలా తేడా ఉంటుందని చెప్పింది.
6/ 9
ఓ అడల్ట్ మరో మహిళను ఆంటీ అని పిలవడం సరికాదంటూ ఓపెన్ అయింది కస్తూరి. బాగా వయసున్న ఓ హీరోని వెళ్లి అంకుల్ అని పిలవగలరా? అని కస్తూరి ప్రశ్నించింది. ఆంటీ అనే పదానికి ఓ డర్టీ మీనింగ్ వచ్చేసిందని చెప్పింది.
7/ 9
అనసూయ కన్నా రెట్టింపు ఏజ్ ఉన్న నటులు ఉన్నారు. వారిని అంకుల్ అని పిలవండి.. చూద్దాం. నాన్సెన్స్.. ఆంటీ అని పిలుస్తున్నారు అంటే రెండే కారణాలు.. వారి మైండ్ లో డర్టీ థాట్స్ అయినా ఉండాలి లేదా అవమానించాలని ఫిక్స్ అయి ఉండాలి అంతే. ఈ వివాదంలో నా మద్దతు అనసూయకే అని చెప్పింది కస్తూరి.
8/ 9
గతంలో తనను ఆంటీ అని పిలిచిన వాళ్లందరికీ దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చింది అనసూయ. నేను మీకు ఆంటీనా..? నేను నా ఫ్యామిలీకి రిలేషన్ ఏంటి అని ప్రశ్నిస్తూ ఫైర్ అయింది. నా కుటుంబాన్ని ఇందులో ఇన్వాల్వ్ చేస్తున్నారు. అందరిపై కేసు పెడతా అని అనసూయ ఆగ్రహం వ్యక్తం చేసి అన్నంత పని చేసింది.
9/ 9
బుల్లితెరపై రాణిస్తూనే వెండితెరపై తన మార్క్ చూపెడుతోంది అనసూయ. రంగస్థలం సినిమాలో రంగమ్మత్తగా చేసి సూపర్ రెస్పాన్స్ అందుకున్న ఈ బ్యూటీ.. పుష్ప 2తో దాక్షాయణిగా చేసి ఆకట్టుకుంది. పలు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు కూడా చేస్తూ జబర్దస్త్ గా దూసుకుపోతోంది.