Gopichand - Seetimaarr : ఖైరతాబాద్ వినాయకుడిని దర్శించకున్న గోపీచంద్ ‘సీటీమార్’ టీమ్..

Gopichand | Seetimaarr : మాచో స్టార్ గోపీచంద్ తమన్నాలు జంటగా నటించిన లేటెస్ట్ స్పోర్ట్స్ డ్రామా సీటీమార్. ఈ సినిమా సెప్టెంబర్ 10న వినాయక చవితి సందర్భంగా విడుదలై బాక్సాఫీస్ దగ్గర అదే రేంజ్‌లో కూత పెడుతోంది. ఈ మూవీ సక్సెస్ అయిన సందర్భంగా చిత్ర యూనిట్.. ఖైరతాబాద్ వినాయకుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసారు. ఈ సందర్భంగా ఖైరతాబాద్ గణేష్ నిర్వాహకులు గోపీచంద్‌తో పాటు చిత్ర యూనిట్‌ను శాలువతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేసారు.