Gopichand | Pakka Commercial : మ్యాచో స్టార్ గోపీచంద్ (Gopichand) ప్రస్తుతం మారుతి (Maruthi) దర్శకత్వంలో పక్కా కమర్షియల్ (Pakka Commercial) అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా జూలై 1, 2022న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. టీజర్స్, ట్రైలర్స్‌తో మంచి బజ్ క్రియేట్ చేసుకున్న ఈ సినిమాకు ప్రస్తుతం మిక్స్డ్ టాక్ వినిపిస్తోంది. అయితే లాంగ్ రన్లో హిట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు ట్రేడ్ పండితులు. ఇక ఈ సినిమా రెండో రోజు ఎంత వసూలు చేసిందంటే... Photo : Twitter
పక్కా కమర్షియల్ బాక్స్ ఆఫీస్ దగ్గర 2 రోజులకు వచ్చిన కలెక్షన్స్ ఏరియాల వారిగా.. Nizam 1.30 కోట్లు, సీడెడ్ 66 కోట్లు, ఉత్తరాంధ్ర 65 లక్షలు, ఈస్ట్ 39 లక్షలు, వెస్ట్ 31 లక్షలు, గుంటూరు 33 లక్షలు, కృష్ణ 28 లక్షలు, నెల్లూరు 22 లక్షలు, ఇక ఏపీ తెలంగాణ మొత్తం 4.14 కోట్ల షేర్.. 6.90 కోట్ల గ్రాస్ వచ్చింది. కర్నాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా 0.20 కోట్లు, ఓవర్సీస్ 0.55 కోట్లు వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రెండు రోజుల్లో 4.89 కోట్ల షేర్‌ను 8.35 కోట్ల గ్రాస్‌ను వసూలు చేసింది. Photo : Twitter
ఇక ఈ సినిమా టికెట్ రేట్ల విషయానికి వస్తే.. ఈ సినిమాకు తెలంగాణలో సింగిల్ థియేటర్లో రూ.100 కాగా మల్టీప్లెక్స్‌లో రూ.160గా ఉంది. ఇక అటు ఆంధ్రలో సింగిల్ థియేటర్లో రూ.100 కాగా మల్టీప్లెక్స్‌లో రూ.150గా ఉండనుందని ప్రకటించారు. అయితే ఇంత తక్కువులో ఈ మధ్య కాలంలో ఏ సినిమా విడుదల కాలేదు. Photo : Twitter
దీంతో ఈ విషయంపై నెటిజన్స్ చిత్రబృందాన్ని అభినందిస్తున్నారు. వచ్చే అన్ని సినిమాలకు ఇదే రేట్లు కంటీన్యూ అయితే ఫ్యామిలీ ఆడియెన్స్ కూడా వస్తారని కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా ప్రిరిలీజ్ ఈవెంట్ ఈ నెల 26వ తేదీన నిర్వహించారు. ఈ ప్రీ రిలీజ్ వేడుకకు ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి వచ్చారు. ఇక ప్రమోషన్స్‌లో భాగంగా ఓ పాటను వదిలింది టీమ్. Photo : Twitter
ఇక ప్రతిరోజు పండగే లాంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత మారుతి (Maruthi) చేస్తున్న సినిమా పక్కా కమర్షియల్. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్, యూవీ క్రియేషన్స్ కలిసి, బన్నీ వాసు నిర్మాతగా తెరకెక్కించారు మారుతి. ఈ (Pakka Commercial) సినిమాలో గోపీచంద్ క్యారెక్టర్ ను మారుతి అద్భుతంగా డిజైన్ చేశారు. కెరీర్లో ఎప్పుడూ లేనంత కొత్తగా గోపీచంద్ చాలా స్టైలిష్ గా కనిపించనున్నారు. సత్యరాజ్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. Photo : Twitter
ఈ చిత్రానికి జేక్స్ బీజాయ్ సంగీతాన్ని అందించారు. పక్కా కమర్షియల్ (Pakka Commercial) టైటిల్‌కు అటు ఇండస్ట్రీ వర్గాల నుంచి ఇటు సాధరణ ప్రేక్షకుల వరకు అంతటా అనూహ్యమైన స్పందన లభించడం విశేషం. అంతేకాదు ఆ మధ్య విడుదలైన పక్కా కమర్షియల్ టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇక ఆ మధ్య ఈ సినిమా నుంచి టైటిల్ సాంగ్‌ను విడుదల చేసిందీ టీమ్. పక్కా కమర్షియల్ అంటూ సాగే ఈ పాటను దివంగత రచయిత సిరివెన్నెల రాయగా.. హేమచంద్ర, జేక్స్ బెజోయ్ పాడారు. క్యాచీ టోన్‌తో అదరగొట్టింది. Photo : Twitter
ఇక గోపీచంద్ (Gopichand) ఇతర సినిమాల విషయానికి వస్తే.. ఆయన హీరోగా వచ్చిన లేటెస్ట్ సినిమా సీటీమార్. సంపత్ నంది దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా స్పోర్ట్స్ నేపథ్యంలో వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో తమన్నా హీరోయిన్గా నటించింది. ఈ సినిమాను శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై ప్రొడక్షన్‌పై శ్రీనివాసా చిట్టూరి నిర్మించారు. ఇక మారుతి తన తదుపరి చిత్రాన్ని ప్రభాస్‌తో చేస్తున్నట్లు టాక్ నడుస్తోంది. ఈ విషయంలో త్వరలో క్లారిటీ రానుంది. Photo : Twitter