కానీ పక్కా కమర్షియల్ సినిమా పై హైప్‌కు తగ్గట్టు కలెక్షన్లు లేవు. మొదటి రోజు ఈ సినిమా రూ. 3.07 కోట్లు (రూ. 5.28 కోట్లు గ్రాస్) షేర్ రాబట్టింది. రెండవ రోజు ఈ సినిమా రూ. 1.83 కోట్లు (3.10 కోట్లు గ్రాస్) వసూళ్లు రాబడితే.. మూడో రోజు ఆదివారం బాక్సాఫీస్ దగ్గర రూ. 1.57 కోట్లు (రూ. 2.65 కోట్లు) వసూళ్లు సాధించింది. మొత్తంగా మూడు రోజుల్లో ఈ సినిమా రూ. 6.47 కోట్లు షేర్ (రూ. 11 కోట్ల గ్రాస్) వసూళ్లను మాత్రమే రాబట్టింది. (Twitter/Photo)
ముందుగా ఈ సినిమా రూ. 19 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెప్ చేసింది. ఆ తర్వాత కొన్ని ఏరియాల్లో రేట్లు తగ్గించారు. మొత్తంగా రూ. 15.20 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. రూ. 16 కోట్ల టార్గెట్‌తో బరిలో దిగిన ‘పక్కా కమర్షియల్’ మూవీ ఓవరాల్‌గా రూ. 6.47 కోట్లు వసూళ్లు చేసింది. మొత్తంగా రూ. 9.53 కోట్ల బ్రేక్ ఈవెన్‌కు దూరంగా ఉంది.ఓవరాల్‌గా ఈ సినిమా టోటల్ రన్లో ఎంత వసూళ్లు చేస్తుందో చూడాలి. (Twitter/Photo)
పక్కా కమర్షియల్ బాక్స్ ఆఫీస్ దగ్గర 3 రోజులకు వచ్చిన కలెక్షన్స్ ఏరియాల వారిగా.. Nizam రూ. 1.73 కోట్లు, సీడెడ్ (రాయలసీమ) రూ. 86 లక్షలు ఉత్తరాంధ్ర రూ. 86 లక్షలు, ఈస్ట్ రూ. 50 లక్షలు, వెస్ట్ రూ. 40 లక్షలు, రూ. 44 లక్షలు, కృష్ణ రూ. 41 లక్షలు, రూ. 29 లక్షలు, ఇక ఏపీ మొత్తం 5.49 కోట్ల షేర్..రూ. 90.5 కోట్ల గ్రాస్ వచ్చింది. కర్నాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా 0.26 కోట్లు, ఓవర్సీస్ 0.72 కోట్లు వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా మూడు రోజుల్లో రూ. 6.4 కోట్ల షేర్‌ను రూ. 11 కోట్ల గ్రాస్‌ను వసూలు చేసింది. Photo : Twitter
‘పక్కా కమర్షియల్’ చిత్రం తాలుకా ఓటీటీ హక్కులను దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్‌తో పాటు తెలుగు స్ట్రీమింగ్ యాప్ ఆహా దక్కించుకున్నాయి. ఈ రెండు స్త్రీమింగ్స్ సంస్థలతో ఓటిటి డీల్‌ను మేకర్స్ లాక్ చేసుకున్నారు. ఈ సినిమా విడుదలైన ఐదు వారాలకు ఈ సినిమా ఓటీటీలోకి అందుబాటులోకి రానుంది. . Photo : Twitter
ఈ సినిమాలో గోపీచంద్ వకీల్ సాబ్ పాత్రలో అదరగొట్టారు. దీంతో పాటు రాశీ ఖన్నా లాయర్ (Raashi Khanna) రోల్లో మెరిసింది. ఈ సినిమాకు తెలంగాణలో సింగిల్ థియేటర్లో రూ.100 కాగా మల్టీప్లెక్స్‌లో రూ.160గా ఉండనుంది. జీఎస్టీతో కలిపి రూ. 200 ఉంది. ఇక అటు ఆంధ్రలో సింగిల్ థియేటర్లో రూ.100 కాగా మల్టీప్లెక్స్‌లో రూ.150గా ఉండనుందని ప్రకటించారు. జీఎస్టీతో రూ. 185 ఉంది. అయితే ఇంత తక్కువులో ఈ మధ్య కాలంలో ఏ సినిమా విడుదల కాలేదు. .Photo : Twitter
పక్కా కమర్షియల్ థియేట్రికల్ బిజినెస్ విషయానికొస్తే.. ఏరియా వైజ్‌గా చూస్తే.. నైజాం (తెలంగాణ)లో రూ. 6 కోట్లు.. సీడెడ్ (రాయలసీమ)లో రూ. 2.50 కోట్లు ఆంధ్ర ప్రదేశ్‌లో రూ. 9 కోట్లు.. మొత్తంగా.. తెలంగాణ + ఆంధ్రప్రదేశ్ కలిపి రూ. 17.50 కోట్లు బిజినెస్ చేసింది. ఇక + రెస్టాఫ్ భారత్ కలిపి రూ. 0.50 కోట్లు ఓవర్సీస్ రూ. 1.20 కోట్లు.. ప్రపంచ వ్యాప్తంగా రూ. 19.20 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఆ తర్వాత రూ. 15.20 కోట్లకు తగ్గించారు. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే బాక్సాపీస్ దగ్గర రూ. 16 కోట్లు రాబట్టాలి. (Twitter/Photo)
ఈ చిత్రానికి జేక్స్ బీజాయ్ సంగీతాన్ని అందించారు. పక్కా కమర్షియల్ (Pakka Commercial) టైటిల్‌కు అటు ఇండస్ట్రీ వర్గాల నుంచి ఇటు సాధరణ ప్రేక్షకుల వరకు అంతటా అనూహ్యమైన స్పందన లభించింది. అంతేకాదు ఆ మధ్య విడుదలైన పక్కా కమర్షియల్ టీజర్, ట్రైలర్లకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇక ఆ మధ్య ఈ సినిమా నుంచి టైటిల్ సాంగ్‌ను విడుదల చేసిందీ టీమ్. పక్కా కమర్షియల్ అంటూ సాగే ఈ పాటను దివంగత రచయిత సిరివెన్నెల రాయగా.. హేమచంద్ర, జేక్స్ బెజోయ్ పాడారు. క్యాచీ టోన్‌తో అదరగొట్టింది. Photo : Twitter
ఇక గోపీచంద్ (Gopichand) ఇతర సినిమాల విషయానికి వస్తే.. ఆయన హీరోగా వచ్చిన లేటెస్ట్ సినిమా సీటీమార్. సంపత్ నంది దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా స్పోర్ట్స్ నేపథ్యంలో వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో తమన్నా హీరోయిన్గా నటించింది. ఈ సినిమాను శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై ప్రొడక్షన్‌పై శ్రీనివాసా చిట్టూరి నిర్మించారు. ఇక మారుతి తన తదుపరి చిత్రాన్ని ప్రభాస్‌తో చేస్తున్నట్లు టాక్ నడుస్తోంది. మరోవైపు కూడా మారుతిని తనతో సినిమా చేయమని చెప్పిన విషయం తెలిసిందే కదా. Photo : Twitter