మాచో స్టార్ గోపీచంద్, అందాల భామ రాశీ ఖన్నా జంటగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం పక్కా కమర్షియల్. మారుతి దర్శకత్వం వహించిన ఈ మూవీ అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 యూవీ క్రియేషన్స్ పతాకాలపై వస్తోంది. అనేక వాయిదాల తర్వాత ఈ సినిమా జూలై 1న విడుదల కానుంది. దీంతో అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రమోషన్స్‌తో బిజీ అయ్యింది. ఇక ప్రమోషన్స్‌లో భాగంగా గోపీచంద్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. Photo : Twitter
గోపీచంద్ ఆ ఇంటర్వూలో మాట్లాడుతూ.. తాను ఇండస్ట్రీకి రావడానికి కారణమైన వారిలో నిర్మాత నాగేశ్వరరావు ఒకరని తెలిపారు. ఆయన నిర్మాణంలో తాను హీరోగా తొలి వలపు సినిమా చేశానని.. అయితే ఆ సినిమా అంతగా విజయం సాధించలేదని అన్నారు. ఆ తర్వాత ఓ ఆరునెలల వరకు ఏ సినిమా రాలేదని.. దీంతో ఆ తర్వాత కొన్ని పరిస్థితుల వల్ల విలన్‌గా చేశానని పేర్కోన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. తాను చేసినవాటిలో కొన్ని ఆడవని ముందే అనిపించాయట. ఆ తర్వాత ఆ సినిమాలను ఎందుకు చేశానని బాధపడ్డారట. Photo : Twitter
ఇక ఈ సందర్భంగా గోపీచంద్ తన చిన్నప్పటి విషయాలను పంచుకుంటూ.. నా అన్న ప్రేమ్‌చంద్ బ్లేడు తీసుకుని నా దగ్గరకు వచ్చి.. నా ముక్కు కోసేశాడని.. అప్పుడు నేను పెరుగన్నం తింటున్నాను. నా ముక్కు నుంచి రక్తంకారుతూ నా పళ్లెంలో నిండిపోయిందని తెలిపారు. తన ఎనిమిదేళ్ల వయసులో నాన్న చనిపోయారని.. చిన్నప్పుడే జీవితం చాలా నేర్పించిందని తెలిపుతూ ఏమోషనలయ్యారు. Photo : Twitter
ఆయన నటిస్తున్న పక్కా కమర్షియల్ సినిమా విషయానికి వస్తే.. గోపీచంద్ (Gopichand) ప్రస్తుతం మారుతి (Maruthi) దర్శకత్వంలో పక్కా కమర్షియల్ (Pakka Commercial) అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా జూలై 1, 2022న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్స్’లో భాగంగా తాజాగా ట్రైలర్‌ను వదిలింది టీమ్. Photo : Twitter
ఇక ఈ సినిమా విడుదల విషయంలో అనేక వాయిదాలు వచ్చాయి. ప్రతిరోజు పండగే లాంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత మారుతి (Maruthi) చేస్తున్న సినిమా పక్కా కమర్షియల్. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్, యూవీ క్రియేషన్స్ కలిసి, బన్నీ వాసు నిర్మాతగా తెరకెక్కిస్తున్నారు మారుతి. Photo : Twitter
ఈ (Pakka Commercial) సినిమాలో గోపీచంద్ క్యారెక్టర్ ను మారుతి అద్భుతంగా డిజైన్ చేశారట. కెరీర్లో ఎప్పుడూ లేనంత కొత్తగా గోపీచంద్ చాలా స్టైలిష్ గా కనిపించనున్నారట. సత్యరాజ్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి జేక్స్ బీజాయ్ సంగీతాన్ని అందిస్తున్నారు. పక్కా కమర్షియల్ (Pakka Commercial) టైటిల్‌కు అటు ఇండస్ట్రీ వర్గాల నుంచి ఇటు సాధరణ ప్రేక్షకుల వరకు అంతటా అనూహ్యమైన స్పందన లభించడం విశేషం. అంతేకాదు ఆ మధ్య విడుదలైన పక్కా కమర్షియల్ టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. Photo : Twitter
ఇక గోపీచంద్ (Gopichand) ఇతర సినిమాల విషయానికి వస్తే.. ఆయన హీరోగా వచ్చిన లేటెస్ట్ సినిమా సీటీమార్. సంపత్ నంది దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా స్పోర్ట్స్ నేపథ్యంలో వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో తమన్నా హీరోయిన్గా నటించింది. ఈ సినిమాను శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై ప్రొడక్షన్‌పై శ్రీనివాసా చిట్టూరి నిర్మించారు. ఇక మారుతి తన తదుపరి చిత్రాన్ని ప్రభాస్‌తో చేస్తున్నట్లు టాక్ నడుస్తోంది. ఈ విషయంలో త్వరలో క్లారిటీ రానుంది. Photo : Twitter