Sirnu Vaitla - Gopichand | శ్రీను వైట్ల.. ఒకపుడు టాలీవుడ్లో కామెడీకి కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించిన దర్శకుడు. అప్పట్లో ఈయన సినిమా వచ్చిందంటే కచ్చితంగా బాక్సాఫీస్ బద్ధలైపోయేది. వరసగా అగ్ర హీరోలతో సినిమాలు చేసి ఆ తర్వాత పూర్ కంటెంట్‌తో సినిమాలు చేసి ఫేడవుడ్ అయిపోయాడు శ్రీను వైట్ల. మరోవైపు గోపీచంద్ కూడా గతేడాది ‘సీటీమార్’తో మంచి విజయం అందుకున్న ఈయన ఈ యేడాది పక్కా కమర్షియల్‌తో ఫ్లాప్‌ను మూట గట్టుకున్నాడు. తాజాగా వీళ్లిద్దరి కాంబోలో ఓ సినిమా రాబోతుంది. (Twitter/Photo)
శ్రీను వైట్ల విషయానికొస్తే.. వెంకీ, దుబాయ్ శ్రీను, ఢీ, కింగ్, దూకుడు, బాద్ షా వంటి చిత్రాలతో తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేశారు. ఇవివి తర్వాత కామెడీ యాక్షన్ చిత్రాలకు ఈయన పేరు వినిపించేది. ఎన్టీఆర్‌తో చేసిన బాద్షా సినిమా తర్వాత చేసిన ‘ఆగడు’, ‘బ్రూస్లీ, ‘మిస్టర్’ అమర్ అక్బర్ ఆంటోని’ వంటి వరుస ఫ్లాపులతో కనుమరుగయ్యాడు. (Twitter/Photo)
ప్రస్తుతం ఇండస్ట్రీలో ఈ దర్శకుడు ఒకడున్నాడనే విషయం ఆడియన్స్‌కు గుర్తు కూడా లేదు. మహేష్ బాబుతో చేసిన ఆగడు సినిమా నుంచి శ్రీను వైట్ల కెరీర్ ఆగమైపోయింది. వరుస ఫ్లాపులతో నిర్మాతలతో పాటు హీరోలు కూడా శ్రీనువైట్లతో సినిమా అంటేనే భయపడుతున్నారు. ఇక గోపీచంద్‌తో చేయబోయే సినిమా కూడా పూర్తి స్థాయి కామెడీ యాక్షన్ ఎంటర్టేనర్‌గా ఉండబోతున్నట్టు సమాచారం. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తి చేసినట్టు సమాచారం. (Twitter/Photo)
ఇక గోపీచంద్ కూడా ‘సీటీమార్’ సక్సెస్ అయినా.. అనుకున్నంత రేంజ్లో హిట్ కాలేకపోయింది. ఇపుడు శ్రీను వైట్లతో చేయబోయే కామెడీ యాక్షన్ ఎంటర్టేనర్‌తో మంచి సక్సెస్ అందుకోవాలనుకుంటున్నాడు. ఇక గోపీచంద్‌తో యాక్షన్ నటుడే కాదు.. మంచి కామెడీ టైమింగ్ కూడా ఉంది. అది రణం, పక్కా కమర్షియల్ వంటి సినిమాలు ప్రూవ్ చేసాయి. మరి శ్రీను వైట్ల గోపీచంద్‌ను ఎలా చూపిస్తాడనేది ఆసక్తికరంగా మారింది.
ఈ సింగం సిరీస్‌లో సూర్య, అనుష్క హీరో, హీరోయిన్స్‌గా చేసిన సంగతి తెలిసిందే. మొదటి రెండు సినిమాలు మంచి విజయం సాధించగా.. మూడో సినిమా అనుకున్నంతగా అలరించలేదు. ఈ సినిమాలు తెలుగులో కూడా మంచి ఆదరణ పొందాయి. ఆయన దర్శకత్వంలో గోపీచంద్ ఓ సినిమాను చేయనున్నారు. ఈ విషయంలో త్వరలో అధికారిక ప్రకటన విడుదలకానుంది.
పక్కా కమర్షియల్ సినిమా విషయానికొస్తే.. ఈ చిత్రం థియేట్రికల్‌గా రూ. 5 కోట్లు నష్టాలు వచ్చినా.. నాన్ థియేట్రికల్‌గా డిజిటల్, శాటిలైట్ కలిపి ఈ సినిమా రూ. 40 కోట్లకు పైగానే నిర్మాతలకు లాభాలను తీసుకొచ్చింది. ఓవరాల్‌గా చూసుకుంటే.. పక్కా కమర్షియల్ మాత్రం నిర్మాతలకు మంచి లాభాలను మిగిల్చింది అని చెప్పాలి.