ఇక ఈ సినిమాను మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా భారీ హైప్ మధ్య రిలీజ్ చేయగా, తొలిరోజే అదిరిపోయే టాక్ తెచ్చుకుంది . ఇక రిలీజ్ అయిన అన్ని చోట్లా పాజిటివ్ టాక్ రావడంతో ఈ సినిమాను చూసేందుకు జనం థియేటర్లకు క్యూ కట్టారు. బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించడంతో ఈ సినిమా పలు రికార్డులు క్రియేట్ చేసి తన సత్తా చాటింది.
ఆతర్వాత RRRచిత్రాన్ని ZEE 5 లో మే 20 నుండి ఉచితంగా స్ట్రీమింగ్ చేశారు. దీంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు. అయితే ఇప్పటికే ఓటీటీలో స్ట్రీమ్ అవుతున్న మరో.. ఓటీటీ యప్లోకి కూడా రానుంది. ఇప్పుడు మరో స్ట్రీమింగ్ యాప్ లో ఈ చిత్రం స్ట్రీమింగ్ కి వచ్చింది. ఈ సినిమా దక్షిణాది భాషల్లోనే మళ్లీ డిస్నీ + హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కి వచ్చింది.
అల్లూరి సీతారామరాజు పాత్రలో, యంగ్ టైగర్ కొమురం భీమ్ పాత్రలో నటించిన పీరియడ్ యాక్షన్ డ్రామా రౌద్రం రణం రుధిరం.. ఈ సినిమా బాహుబలి కంటే ఎక్కువగా భారీ స్థాయిలో ఓపెనింగ్స్ అందుకున్న సినిమాగా ఆర్ఆర్ఆర్ చరిత్రను సృష్టించింది. కేవలం తెలుగులోనే కాకుండా మిగతా భాషల్లో కూడా ఈ సినిమాకు భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది.