Radhye Shyam : యంగ్ రెబల్ స్టార్ స్టార్ ప్రభాస్ (Prabhas), పూజ హెగ్డే (Pooja Hegde) జంటగా రూపొందుతున్న పాన్ ఇండియన్ సినిమా 'రాధేశ్యామ్' (Radhye Shyam). యంగ్ డైరక్టర్ రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే.
యంగ్ రెబల్ స్టార్ స్టార్ ప్రభాస్ (Prabhas), పూజ హెగ్డే (Pooja Hegde) జంటగా రూపొందుతున్న పాన్ ఇండియన్ సినిమా 'రాధేశ్యామ్' (Radhye Shyam). యంగ్ డైరక్టర్ రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే.
2/ 7
ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర టీజర్ మరియు సింగిల్ లిరిక్ సాంగ్ ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ ను అందుకున్నాయి. టీజర్ చూస్తే ఈ సినిమా కథకి ట్రైన్ కి దగ్గర సంబంధం ఉందని అర్థం అవుతుంది.
3/ 7
ఈ సినిమా 2022, జనవరి 14న ప్రపంచవ్యాప్తంగా 7 భాషలలో రిలీజ్ చేయబోతున్నారు. లేటెస్ట్ గా ఈ మూవీ గురించి క్రేజీ అప్ డేట్ ఒకటి వైరల్ గా మారింది. ఈ మూవీ విడుదల కోసం రికార్డ్ స్థాయిలో థియేటర్స్‌ను లాక్ చేసినట్టు తాజా సమాచారం.
4/ 7
ఈ చిత్రం హిందీ వెర్షన్‌ను నార్త్‌లో రిలీజ్ చేయడానికి గానూ 3500 స్క్రీన్స్‌ను ఇప్పటికే లాక్ చేసినట్టు తెలుస్తోంది. ఈ సినిమాకు సరిగ్గా వారం రోజులు ముందు రాజమౌళి రూపొందిస్తున్న 'ఆర్ఆర్ఆర్' రిలీజ్ కానుంది. అయినా కూడా 'రాధేశ్యామ్' చిత్రాన్ని భారీ స్థాయిలో రిలీజ్ చేయబోతున్నారు.
5/ 7
ఈ నేపథ్యంలోనే ఇప్పటినుంచే థియేటర్స్‌ను ఆక్యుపై చేసుకుంటున్నారట. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ - ప్రమోద్ - ప్రసీద భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి వచ్చిన 'ఈ రాతలే' సాంగ్ యూట్యూబ్‌లో బాగా ట్రెండ్ అవుతోంది.
6/ 7
ఇక, ఈ సినిమా ఒక నిజ జీవిత సంఘటన ఆధారంగా ప్రేక్షకుల ముందుకి రాబోతోందట. ఇంతకు ముందెన్నడూ చూడని అటువంటి విధంగా టైం లైన్ కాన్సెప్టుతో ఈ సినిమా తెరకెక్కనుందని వార్తలు షికార్లు చేస్తున్నాయ్.
7/ 7
చాలా కాలం తర్వాత ప్రభాస్ నటిస్తున్న ప్రేమకథ ఇది. అందుకే ఈ సినిమాపై ఫ్యాన్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయ్. ఈ సినిమాలో కృష్ణంరాజు కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే.