ఇదేంటిది కొన్ని దశాబ్దాలుగా టాలీవుడ్ రారాజుగా వెలుగొందుతూ వస్తున్న మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) పేరు మార్చుకున్నారా? అంటే అవుననక తప్పడం లేదు మరి. ఇందుకు పక్కా ప్రూఫ్ కూడా దొరకడంతో చిరంజీవి పేరు మార్పుకు సంబంధించిన పలు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇంతకీ అసలు విషయం ఏంటి? చిరంజీవి పేరు మార్చుకున్నారా? అయితే ఎలా అనేది ఇప్పుడు చూద్దాం..
ఈ వీడియో సరిగ్గా పరిశీలిస్తే.. ఇందులో చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ కనిపించింది. Megastar Chiranjeevi అనే పేరుకు బదులు మరో 'E'ని యాడ్ చేసి Megastar Chiranjeeevi అని స్క్రీన్‌పై వచ్చింది. దీంతో ఇది చూసిన వారంతా కూడా చిరంజీవి పేరు మార్చుకున్నారని చెప్పుకోవడం షురూ చేశారు. ఇంకేముంది టాలీవుడ్లో ఈ ఇష్యూ హాట్ టాపిక్ అయింది.
రాజకీయ ప్రయాణం అనంతరం తిరిగి సినిమాల్లోకి రీ- ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి.. ఖైదీ నెంబర్ 150, సైరా నరసింహా రెడ్డి లాంటి సినిమాలతో హిట్స్ అందుకున్నారు. ఈ సినిమాలు రెండూ కూడా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధించాయి. కాకపోతే ఇటీవల తన కుమారుడితో కలిసి చేసిన ఆచార్య సినిమా మాత్రం బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది.