Ram Charan | ఆస్కార్ విన్నింగ్ మూవీ RRRతో వరల్డ్ వైప్ పాపులారిటీ దక్కించుకున్నారు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. ఆయన యువీ క్రియేషన్స్‌లోని తన స్నేహితుడు విక్రమ్ రెడ్డితో చేతులు కలిపారు. కొత్త కాన్సెప్ట్ చిత్రాలను, యంగ్ టాలెంట్‌ను ఎంకరేజ్ చేయటానికి వీరిద్దరూ ‘వి మెగా పిక్చర్స్’ బ్యానర్‌ను ప్రారంభించారు. పాన్ ఇండియా ప్రేక్షకులు మెచ్చేలా విలక్షణమైన చిత్రాలను ఈ సంస్థ రూపొందించనుంది. అదే సమయంలో యంగ్ టాలెంట్‌ను ఎంకరేజ్ చేయటానికి వేదికగా మారబోతుంది.