ఇషాన్ సూర్య దర్శకత్వంలో రూపొందిన జిన్నా (Ginna) సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ రాబట్టలేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి తొలి రోజుకు గాను 12 లక్షల రూపాయల షేర్ వచ్చిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా చూస్తే జిన్నా ఫస్ట్ డే కలెక్షన్స్ 15 లక్షలు అంటున్నారు.
అదేవిధంగా జాతి రత్నాలు ఫేమ్ అనుదీప్ తెరకెక్కించిన ప్రిన్స్ సినిమా కూడా సర్దార్, ఓరిదేవుడా రేంజ్ కలెక్షన్స్ రాబట్టిందని తెలిసింది. శివ కార్తికేయన్ హీరోగా వచ్చిన ఈ సినిమాకు తొలిరోజున నైజాంలో రూ. 35 లక్షలు రాగా.. సీడెడ్, ఆంధ్ర కలిపి రూ.55 లక్షలు వచ్చాయి. వరల్డ్ వైడ్ చూస్తే కోటి మార్క్ క్రాస్ చేసిందట. సో.. ఈ నాలుగు సినిమాలకు కూడా ఈ వారాంతం చాలా కీలకం కానుంది.