Manjima Wedding: మరో కోలీవుడ్ స్టార్ కపుల్ పెళ్లి... ఒక్కటైన గౌతమ్, మంజీమ..!
Manjima Wedding: మరో కోలీవుడ్ స్టార్ కపుల్ పెళ్లి... ఒక్కటైన గౌతమ్, మంజీమ..!
కోలీవుడ్లో మరో జంట పెళ్లి పీటలెక్కింది. వివాహ బంధంతో ఒక్కటయ్యింది. కోలీవుడ్ స్టార్ కపుల్... గౌతమ్ కార్తీక్, మంజీమ మోహన్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరి వివాహం ఓహోటల్లో కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగింది.
కోలీవుడ్లో మరో ఇద్దరు స్టార్స్ పెళ్లితో ఒక్కటయ్యారు. నటుడు గౌతమ్ కార్తీక్ - మంజిమా మోహన్ పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
2/ 8
నటుడు కార్తీక్ కుమారుడు గౌతమ్ కార్తీక్. గౌతం కార్తీక్ మణిరత్నం చిత్రం కాదల్తో సినీ రంగ ప్రవేశం చేశాడు. ఆ తర్వాత రంగూన్, ఇవాన్ తంత్రన్ వంటి పలు చిత్రాల్లో నటించారు.
3/ 8
మంజిమా మోహన్ మలయాళంలో బాలనటిగా నటించింది.ఆమె తమిళ చిత్రం అచ్చం హిన్ మడమైయాడలో హీరోయిన్గా రంగప్రవేశం చేసింది.
4/ 8
గౌతమ్ కార్తీక్, మంజిమా మోహన్లు దేవరాట్టంలో కలిసి నటించారు. వీరిద్దరూ ఆ సినిమాలో నటిస్తూన్న సమయంలోనే ప్రేమలో పడ్డారు.
5/ 8
గౌతమ్ మరియు మంజిమ ఇద్దరూ తమ సోషల్ మీడియా పేజీలలో తమ ప్రేమ వ్యవహారాన్ని ప్రకటించారు. త్వరలో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నామని చెప్పారు.
6/ 8
ఈరోజు నవంబర్ 28న తల్లిదండ్రుల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. వీరి పెళ్లి చాలా సింపుల్గా జరిగింది. దీంతో ఈ పెళ్లికి సంబంధించిన పిక్స్, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
7/ 8
ఈ రొమాంటిక్ జంటకు పలువురు సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కోలీవుడ్ సెలబ్రిటీలు విషెస్ అందిస్తున్నారు.
8/ 8
చెన్నైలోని ఓ హోటల్లో వీరి పెళ్లి ఘనంగా జరిగింది. ఇండస్ట్రీకి చెందిన పలువురు హాజరై నూతన వధువు వరులను ఆశీర్వదించారు. గౌతమ్, మంజిమ పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.