ముంబైలోని బాంద్రాలో ఉన్న సల్మాన్ ఖాన్ ఇంటిని రెక్కీ చేయమని రాజస్థాన్‌కు చెందిన గ్యాంగ్‌స్టర్ సంపత్ నెహ్రాను తాను కోరినట్లు లారెన్స్ బిష్ణోయ్ వెల్లడించాడు. అయితే, ఆ సమయంలో నెహ్రా దగ్గర కేవలం పిస్టల్ ఉన్నందున సల్మాన్ ఖాన్‌పై సరిగ్గా గురి పెట్టలేక పోయాడని చెప్పాడు. గ్యాంగ్‌స్టర్ నెహ్రా ఉన్న అదే గ్రామంలో నివసించే దినేష్ ఫౌజీ అనే వ్యక్తి ద్వారా 4 లక్షల RK స్ప్రింగ్ రైఫిల్‌ను ఆర్డర్ చేశాడని చెప్పాడు.
డాగర్ అసోసియేట్ అనిల్ పాండేకి ఈ చెల్లింపు జరిగినట్లు సమాచారం. ఈ రైఫిల్‌ను 2018లో డాగర్ వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నారు. గత నెలలో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సల్మాన్, అతని తండ్రికి బెదిరింపు లేఖ రాసినట్లు వార్తలు వచ్చాయి. అలాగే సల్మాన్ పై 2011లో కూడా ఓ సారి దాడికి ప్రయత్నించి విఫలమయ్యారట లారెన్స్ బిష్ణోయ్.