Pawan Kalyan - Gabbar Singh@10 Years | పవన్ కళ్యాణ్ ‘గబ్బర్ సింగ్’కు 10 ఏళ్లు పూర్తి.. సాధించిన రికార్డులు.. అంతేకాదు పవర్ స్టార్ అభిమానులతో ఈ సినిమా కెవ్వు కేక పెట్టించాయి. హరీష్ శంకర్ దర్శకత్వంలో బండ్ల గణేష్ నిర్మాణంలో తెరకెక్కిన గబ్బర్ సింగ్ బాక్సాఫీస్ దగ్గర రికార్డుల మోత మోగించింది. ఈ సినిమా విడుదలై పదేళ్లు పూర్తవుతున్న ఇప్పటికీ ఈ సినిమా అంటే ప్రేక్షకుల్లో క్రేజ్ తగ్గలేదు. (Twitter/Photo)
‘గబ్బర్ సింగ్’ సినిమాను ముందుగా పవన్ కళ్యాణ్ .. తన అన్నయ్య నాగబాబు ‘అంజనా ప్రొడక్షన్స్’లో చేయాలనుకున్నారు. కానీ అప్పటికే ’ఆరెంజ్’ సినిమాతో కోలుకోకుండా ఉన్న అన్నయ్య.. ఈ సినిమా ఫ్లాపైతే ఎలా అని ఆలోచించి తనతో అంతకు ముందు ‘తీన్మార్’ సినిమా చేసి చేతులు కాల్చుకున్న బండ్ల గణేష్ చేతిలో ‘గబ్బర్ సింగ్’ నిర్మాణ బాధ్యతలు పెట్టారు పవన్ కళ్యాణ్. (Twitter/Photo)
పవన్ కళ్యాణ్ విషయానికొస్తే.. హిట్టు ఫ్లాపులతో సంబంధం లేని క్రేజ్ ఉంది. అది చాలా మంది హీరోలకు ఉండదు. హిట్ వచ్చినపుడు మాత్రమే వాళ్లకు మార్కెట్ ఉంటుంది.. లేదంటే మళ్లీ పోతుంది. కానీ పవన్ అలా కాదు. ఒకసారి వచ్చిన క్రేజ్ అలాగే ఉండిపోయింది. ఆయన సినిమాలు వచ్చిన ప్రతీసారి కూడా రికార్డులు తిరగరాస్తూనే ఉంటాయి. హిట్టైతే చరిత్ర.. ఫ్లాప్ అయినా కూడా రికార్డు ఓపెనింగ్స్ ఖాయం. అలాంటి పవన్ వరస ఫ్లాపులకు తెరదించిన సినిమా గబ్బర్ సింగ్.
నైజాం- 19.50 కోట్లు
సీడెడ్- 9.30 కోట్లు
ఉత్తరాంధ్ర- 5.50 కోట్లు
ఈస్ట్- 3.75 కోట్లు
వెస్ట్- 3.43 కోట్లు
గుంటూరు- 4.35 కోట్లు
కృష్ణా- 3.18 కోట్లు
నెల్లూరు- 2.05 కోట్లు
ఏపీ + తెలంగాణ (టోటల్)- 51.06 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా- 4.80 కోట్లు
ఓవర్సీస్- 4.30 కోట్లు
వరల్డ్ వైడ్ (టోటల్)- 60.16 కోట్లు... మొత్తంగా ఈ సినిమా 65 కేంద్రాల్లో 100 రోజులకు పైగా నడించి రికార్డ్స్ క్రియేట్ చేసింది. (Twitter/Photo)
దాదాపు 35 కోట్ల బిజినెస్ చేసిన గబ్బర్ సింగ్.. 25 కోట్లకు పైగా లాభాలు తీసుకొచ్చింది. అప్పట్లో పవన్ చేసిన హంగామాకు బాక్సాఫీస్ షేక్ అయిపోయింది. ఒక్కసారి పవన్ రేంజ్‌కు సరిపోయే సినిమా వస్తే ఎలా ఉంటుందో.. దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుందో మరోసారి తెలుగు ఇండస్ట్రీకి రుచి చూపించిన సినిమా గబ్బర్ సింగ్. హరీష్ శంకర్ ఈ సినిమాతో స్టార్ డైరెక్టర్ అయిపోయాడు.
నాక్కొంచెం తిక్కుంది.. దానికో లెక్కుంది.. అంటూ పవన్ తిక్కను సరిగ్గా లెక్కలేసారు దర్శకుడు హరీష్ శంకర్. ఆ తిక్క పేరు గబ్బర్ సింగ్.. ఈ సినిమా వచ్చి అప్పుడే 9 ఏళ్లవుతుంది. కాలం అంత వేగంగా వెళ్లిపోతుందా అన్నట్లుంది కదా.. మే 11, 2012న విడుదలైంది గబ్బర్ సింగ్. కంటెంట్ ఉన్నోడికి కటౌట్ చాలు.. మార్కెట్లో అతడి ఫాలోయింగ్ చూస్తే మెంటల్ వచ్చేస్తుంది లాంటి డైలాగ్స్ పవన్ కోసమే అన్నట్లుగా అతినట్టు సరిపోయాయి.. (Twitter/Photo)
పవన్ ఇమేజ్‌తో పాటు హరీష్ శంకర్ టేకింగ్.. అంత్యాక్షరి ఎపిసోడ్.. కబడ్డి ఎపిసోడ్.. దేవీ శ్రీ ప్రసాద్ పాటలు అన్నీ వర్కవుట్ అయ్యాయి. అప్పటి వరకు వరస ప్లాపుల్లో ఉన్న పవన్ కళ్యాణ్.. ఈ చిత్రంతో బాక్సాఫీస్‌పైకి తన పంజా విసిరారు. ఈ సినిమా సక్సెస్‌తో పవన్ కళ్యాణ్ ఇమేజ్ పెరుగుతూ పోయింది. (Twitter/Photo)