గత కొన్నేళ్లుగా ప్రేక్షకుల అభిరుచుల్లో పెద్ద మార్పు వచ్చింది. ముఖ్యంగా కరోనా తర్వాత ప్రేక్షకులు ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌కు అలవాటు పడ్డారు. ప్రపంచ సినిమాలకు అలవాడు పడ్డారు. ఈ కోవలో ప్రేక్షకులు అది స్టార్స్ నటించిన సినిమాలైనా కథ, కథనం బాగుందనే టాక్ వస్తేనే చూస్తున్నారు. అది కూడా అద్భుతం.. ఇది థియేటర్స్‌లో మాత్రమే చూడాల్సిన సినిమా అంటేనే కుటుంబంతో కలిసి థియేటర్స్ వైపు అడుగులు వేస్తున్నారు. లేకపోతే ఓటీటీలో వస్తే చూద్దాంలే అని లైట్ తీసుకుంటున్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా జబర్ధస్త్ స్టార్ సుడిగాలి సుధీర్ నటించిన సినిమాకు అన్ని ఏరియాల్లో మొదటి రోజు సూపర్ రెస్పాన్స్ వస్తోంది. (Twitter/Photo)
ముఖ్యంగా పెద్ద హీరోల సినిమాలే చూడటానికి ఆసక్తి చూపని జనాలు.. జబర్ధస్త్ కామెడీ షోతో పాపులర్ అయిన సుడిగాలి సుధీర్ సినిమా చూసేందుకు క్యూ కడుతున్నారు. ముఖ్యంగా ఏపీ, తెలంగాణలోని బీ,సీ సెంటర్స్‌లో ‘గాలోడు’ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా చాలా బీ,సీ సెంటర్స్‌లో మార్నింగ్, మాట్నీ హౌస్‌ఫుల్స్ పడ్డాయి. ఈవెనింగ్ షో, సెకండ్ షోలకు బుక్ మై షోలో ఆల్రెడీ బుకింగ్స్ నమోదు అవుతున్నాయి. (Twitter/Photo)
ఈ రోజు విడుదలైన ‘గాలోడు’ దాదాపు అన్ని సెంటర్స్‌లో ఇప్పటికే ఆడుతున్న సినిమాల కన్నా ఎక్కవ వసూళ్లు రాబడుతున్నట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఒక కొత్త హీరో అది కూడా స్మాల్ స్క్రీన్ ద్వారా పరిచయమైన ఈయన సినిమాకు ఈ రేంజ్లో రెస్పాన్స్ రావడం మాములు విషయం కాదు. ఈ సినిమాకు తొలి రోజు అన్ని ఏరియాల్లో దాదాపు రూ. 50 లక్షల నుంచి రూ. 75 లక్షల వరకు షేర్.. రూ. కోటి నుంచి కోటిన్నర వరకు గ్రాస్ వసూళ్లు రాబట్టే అవకాశం ఉంది. ఈ రేంజ్ కలెక్షన్స్ వస్తే సుడిగాలి సుధీర్ సుడి తిరిగినట్టే అని చెప్పాలి. ట్రేడ్ రిపోర్ట్స్ చూస్తుంటే.. ఈ వసూళ్లు రాబట్టడం పెద్ద కష్టమేమి కాదంటున్నారు. (Twitter/Photo)
సుధీర్ నటించిన 'గాలోడు' సినిమాకు చేసిన ప్రమోషన్స్ ఈ సినిమాపై అంచనాలు బాగా పెంచాయి. దీంతో ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. నైజాంలో 130, సీడెడ్‌లో 60, ఆంధ్రా ప్రాంతంలోని అన్ని ఏరియాల్లో కలిపి 185 థియేటర్లలో అంటే మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 375 థియేటర్లలో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకొచ్చింది.
ఇకపోతే ఈ సినిమాలో సుధీర్ రెమ్యునరేషన్ ఎంత అనే విషయాలపై ఆసక్తికర చర్చ జరుగుతుంది. ఇంతకుముందు సుధీర్ 3 మంకీస్ అనే సినిమాలో కూడా హీరోగా నటించాడు. అయితే ఆ సినిమా కంటే ఈ సినిమాను కాస్త ఎక్కువ బడ్జెట్ తో నిర్మించారు. దీంతో ఈ సినిమా కోసం అతను దాదాపు రూ. 40 నుంచి 50 నుంచి లక్షల వరకు పారితోషికం తీసుకున్నారట సుధీర్.