ప్రతీవారం కొత్త సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తూనే ఉంటాయి. ఈ వారం కూడా ఇదే జరగబోతుంది. చాలా వరకు థియేటర్స్.. మరికొన్ని ఓటిటి వేదికగా సినిమాలు విడుదల కాబోతున్నాయి. మూడు వారాల గ్యాప్‌లోనే రొమాంటిక్, రజినీకాంత్ పెద్దన్న సినిమాలు కూడా ఓటిటిలో వచ్చేస్తున్నాయి. మరోవైపు రాజ్ తరుణ్, సంపూర్ణేష్ బాబు లాంటి హీరోలు ఈ వారం థియేటర్స్‌లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మరి ఈ వారం థియేటర్స్ ప్లస్ ఓటిటిలో రాబోయే సినిమాలేంటో ఓ సారి చూద్దాం..
6. ఆశా ఎన్కౌంటర్:
దర్శకుడు: ఆనంద్ చంద్ర, రిలీజ్: నవంబర్ 26 థియేటర్స్ (2019, నవంబర్ 26న హైదరాబాద్ నగర శివారులోని చటాన్‌పల్లి వద్ద ఓ యువతిపై కొందరు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడి.. అనంతరం ఆమెను అతి క్రూరంగా హత్య చేశారు. ఈ కథను నేపథ్యంగా చేసుకుని ఆనంద్ చంద్ర ‘ఆశ ఎన్కౌంటర్’ తెరకెక్కించారు)