బిగ్ బిన్ సీజన్ 5 ముగిసింది. విజె సన్నీ విన్నర్ గా నిలువగా షణ్ముఖ్ (Shanmukh) రన్నర్ గా మిగిలాడు. ఇక బిగ్ బాస్ లో ఏది జరిగినా అదంతా అక్కడివరకే అని, బయటికొచ్చాకా తమ ప్రపంచం తమదని కంటెస్టెంట్లు చెప్పుకొచ్చారు. అయితే అందుతున్న సమాచారం ప్రకారం బిగ్ బాస్ వలన ఒక ప్రేమ జంట విడిపోయే పరిస్థితి వచ్చిందని తెలుస్తోంది.
ఆమె పోస్టుల్లో విరహ బాధ తెలుస్తోందని అంటున్నారు. “ఈ సంవంత్సరం నాకు ఏమి బాలేదు.. అయినా నేను చాల నేర్చుకున్నాను”.. ‘కనీసం నీ మనస్సాక్షితోనైనా నిజాయితీగా ఉండు’.. ‘నా చుట్టూ ఉన్న పరిస్థితులు ప్రతికూలంగా మారాయని తెలిసినప్పటికీ నా జీవితాన్ని నేను ఎంజాయ్ చేస్తున్నా’ అంటూ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీ లో రాసుకొచ్చింది.