తెలుగు ఇండస్ట్రీలో యాంకర్స్ చాలా మంది ఉన్నారు. మేల్ యాంకర్స్కు ఇక్కడ కొదవ ఉంటుందేమో కానీ.. ఫీమేల్ యాంకర్స్ మాత్రం చాలా మంది ఉన్నారు. ముఖ్యంగా సుమ కనకాల నుంచి నిన్న మొన్నటి విష్ణు ప్రియ వరకు చాలా మంది యాంకర్స్ ఉన్నారు. అయితే వాళ్లు కేవలం యాంకర్స్ మాత్రమే కాదు.. హీరోయిన్లుగానూ సత్తా చూపిస్తున్నారు. సీనియర్ యాంకర్స్ నుంచి జూనియర్స్ వరకు చాలా మంది ముద్దుగుమ్మలు వెండితెరపై కూడా సత్తా చూపించారు. తాజాగా 46 ఏళ్ళ వయసులో సుమ కనకాల కీలక పాత్రలో జయమ్మ పంచాయితీ సినిమా వస్తుంది. ఈమె కంటే ముందు హీరోయిన్లుగా నటించిన యాంకర్స్ ఎవరో చూద్దాం..