తెలుగు ఇండస్ట్రీలో ఉన్న ప్రస్టేజియస్ నిర్మాణ సంస్థల్లో మైత్రి మూవీ మేకర్స్ కూడా ఒకటి. ఎప్పుడూ వరస సినిమాలు నిర్మిస్తూనే ఉంటారు వీళ్లు. ఇప్పటికే 2021లో వాళ్ల నుంచి ఉప్పెన, పుష్ప లాంటి సినిమాలు వచ్చాయి. ఇప్పుడు ఈ సంస్థ నుంచి ఒకటి రెండు కాదు 10 సినిమాలు వస్తున్నాయి. టాలీవుడ్ టాప్ హీరోలందర్నీ మైత్రి మూవీ మేకర్స్ బ్లాక్ చేసింది. వీళ్ల నుంచి రాబోయే మూడేళ్ల వరకు భారీ సినిమాలు రానున్నాయి. మరోవైపు చిన్న సినిమాలను కూడా నిర్మిస్తూ బిజీగా ఉన్నారు మైత్రి మూవీ మేకర్స్.
3. ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్: జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో ఒక భారీ సినిమా నిర్మించబోతున్నారు మైత్రి మూవీ మేకర్స్. దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. కొరటాల శివ సినిమా పూర్తి అయిన తర్వాత ఇది మొదలు కానుంది. ఇంతకు ముందే ఈ నిర్మాణ సంస్థలో జనతా గ్యారేజ్ సినిమా చేసాడు జూనియర్ ఎన్టీఆర్.
4. నాని అంటే సుందరానికి: నానితో రెండేళ్ల కింద గ్యాంగ్ లీడర్ సినిమా చేసిన మైత్రి మూవీ మేకర్స్.. ఇప్పుడు అంటే సుందరానికి అంటూ మరోసారి వస్తున్నారు. గ్యాంగ్ లీడర్ నిరాశ పరచిన కూడా మరోసారి నేచురల్ స్టార్ తో సినిమా చేస్తున్నారు ఈ నిర్మాతలు. వివేక్ ఆత్రేయ దీనికి దర్శకుడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుంది అంటే సుందరానికి.
5. విజయ్ దేవరకొండ - శివ నిర్వాణ సినిమా: రౌడీ బాయ్ విజయ్ దేవరకొండతో ఒక సినిమా నిర్మించడానికి సిద్ధమవుతోంది మైత్రి మూవీ మేకర్స్. ఇప్పటికే ఈయనతో డియర్ కామ్రేడ్ సినిమా చేశారు వాళ్ళు. తాజాగా శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా ఒక సినిమా నిర్మించబోతోంది మైత్రి మూవీ మేకర్స్. 2023 లో ఈ సినిమా మొదలు కానుంది.
6. చిరంజీవి - బాబీ సినిమా: మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో ఇప్పటికే ఒక సినిమాను నిర్మిస్తున్నారు మైత్రి మూవీ మేకర్స్. దీనికి సంబంధించిన షూటింగ్ వేగంగా జరుగుతోంది. ఇందులో మాస్ రాజా రవితేజ కీలక పాత్రలో నటిస్తున్నాడు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఇందులో శృతి హాసన్ హీరోయిన్.
7. పవన్ కళ్యాణ్ - హరీష్ శంకర్ భవదీయుడు భగత్‌సింగ్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా నిర్మించాలని చాలాకాలంగా మైత్రి నిర్మాతలు వేచి చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు నాలుగేళ్ల కిందట అడ్వాన్స్ ఇచ్చారు. తాజాగా ఈ కాంబినేషన్లో హరీష్ శంకర్ దర్శకత్వంలో భవదీయుడు భగత్ సింగ్ సినిమా వస్తుంది. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది.
10. ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి: సుధీర్ బాబు ఇంద్రగంటి మోహన కృష్ణ కాంబినేషన్ లో వస్తున్న ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమాను మైత్రి మూవీ మేకర్స్ సమర్పిస్తుంది. సమ్మోహనం, వి తర్వాత సుధీర్ బాబుతో ఇంద్రగంటి చేస్తున్న మూడో సినిమా ఇది. మ్యాజికల్ హీరోయిన్ కృతి శెట్టి ఇందులో సుధీర్ బాబుకు జోడిగా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.