Tollywood Heroines: అటు వెబ్ సిరీస్.. ఇటు సినిమాలు.. రెండు చేతులా సంపాదిస్తున్న హీరోయిన్లు..

స్టార్ హీరోయిన్స్ వెబ్ సిరీస్‌లు చేయాలంటే ఒకప్పుడు చాలా నామూషీగా ఫీల్ అయ్యేవాళ్లు. దానికోసం సపరేట్‌గా కొందరు హీరోయిన్లు ఉంటారు.. వాళ్లతో మాత్రమే వెబ్ సిరీస్ చేయాలని అనుకునేవాళ్లు. కానీ కాలం మారిపోయింది. ఇప్పుడు వెబ్ సిరీస్ టైమ్ నడుస్తుంది. అందుకే డిజిటల్ వరల్డ్‌లోకి అంతా వచ్చేస్తున్నారు. స్టార్ హీరోయిన్స్ కూడా ఓ మెట్టు దిగి వెబ్ సిరీస్‌లలో నటిస్తున్నారు. చాలా మంది పెద్ద హీరోయిన్లు ఇప్పుడు ఈ లఘు చిత్రాల వైపు అడుగులు వేస్తున్నారు.