కరోనా వైరస్ మరోసారి పూర్తి స్థాయిలో విజృంభిస్తుండటంతో సినిమాల పరిస్థితి అగమ్యగోచరంగా మారిపోయింది. కొన్ని సినిమాలు ఇప్పటికీ థియేటర్స్లో విడుదల అవుతున్నాయి కానీ చాలా వరకు ఓటిటి వైపు అడుగులు వేస్తున్నాయి. ముఖ్యంగా ఆహాతో పాటు మిగిలిన ఓటిటి వేదికలపై కూడా కొత్త సినిమాలు విడుదల కానున్నాయి. సంక్రాంతి వీకెండ్ అంతా కొత్త సినిమాలతో నిండిపోనుంది. మరి జనవరి 10 నుంచి 17 మధ్య ఓటిటి వేదికగా విడుదల కాబోయే ఆ సినిమాలేంటో చూద్దాం..
ది అమెరికన్ డ్రీమ్:
తేజ ‘నీకు నాకు డ్యాష్ డ్యాష్’ సినిమాతో హీరోగా పరిచయమైన ప్రిన్స్.. చాలా రోజుల తర్వాత నటించిన సినిమా ‘ది అమెరికన్ డ్రీమ్’. ఆహా ఒరిజినల్ ఫిల్మ్ ఇది. అమెరికాలో ఓ కుర్రాడికి ఎదురయ్యే కష్టాల నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. విఘ్నేశ్ కౌశిక్ దర్శకుడు. నేహా ఈ సినిమాలో కథానాయికగా నటించింది. ఈ చిత్రం జనవరి 14న ‘ఆహా’ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతుంది.