తెలుగు ఇండస్ట్రీలో ఫీమేల్ యాంకర్స్దే ఎప్పుడూ డామినేషన్. ముఖ్యంగా సుమ కనకాల నుంచి నిన్న మొన్నటి విష్ణు ప్రియ వరకు చాలా మంది యాంకర్స్ ఉన్నారు. అయితే వాళ్లు కేవలం యాంకర్స్ మాత్రమే కాదు.. హీరోయిన్లుగానూ సత్తా చూపిస్తున్నారు. సీనియర్ యాంకర్స్ నుంచి జూనియర్స్ వరకు చాలా మంది ముద్దుగుమ్మలు వెండితెరపై కూడా సత్తా చూపించారు. తాజాగా 46 ఏళ్ళ వయసులో సుమ కనకాల కీలక పాత్రలో జయమ్మ పంచాయితీ సినిమా వస్తుంది. ఈమె కంటే ముందు హీరోయిన్లుగా నటించిన యాంకర్స్ ఎవరో చూద్దాం..
1. సుమ కనకాల: కెరీర్ మొదట్లో కొన్ని సినిమాలు చేసిన సుమ.. ఆ తర్వాత యాంకర్ అయిపోయింది. ఒక్కసారి బుల్లితెరపైకి వచ్చిన తర్వాత ఈమె మళ్లీ సినిమాల వైపు చూడలేదు. కానీ ఇప్పుడు సుమ కీలక పాత్రలో జయమ్మ పంచాయితీ సినిమా వస్తుంది. త్వరలోనే విడుదల కానుంది ఈ చిత్రం. జయమ్మ పంచాయితీ టీజర్ కూడా మంచి అప్లాజ్ తెచ్చుకుంది.
2. అనసూయ భరద్వాజ్: న్యూస్ యాంకర్‌గా కెరీర్ మొదలుపెట్టి అనసూయ భరద్వాజ్.. ఇప్పుడు ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వరస సినిమాలకు తోడు కారెక్టర్ ఆర్టిస్టుగానూ బిజీగా ఉంది అనసూయ. పుష్ప 2తో పాటు ప్రస్తుతం చాలా సినిమాలు చేస్తుంది ఈమె. మొన్నటి ఖిలాడి సినిమాలో అమ్మడు హీరోయిన్లతో పోటీ పడి మరీ అందాలను ఆరబోసింది.
9. ఉదయభాను: సీనియర్ యాంకర్ ఉదయభాను కూడా ఒకప్పుడు హీరోయిన్గా నటించింది. ఖైదీ బ్రదర్స్, కొండవీటి సింహాసనం సహా మరికొన్ని సినిమాలలో ఉదయభాను కీలక పాత్రలతో పాటు హీరోయిన్‌గానూ నటించి మెప్పించింది. ఆ తర్వాత సినిమాలకు దూరమైపోయింది ఈమె. బుల్లితెరపై సత్తా చూపించింది. తాజాగా చాలా రోజుల తర్వాత ఉదయభాను సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టింది.