హీరో అంటే ఎప్పుడూ ఆంజనేయుడు పుత్రుడిలాగే ఉండాలా.. 100 మందిని ఒక్కచేత్తోనే మట్టి కరిపించాలా.. అప్పుడప్పుడూ బయటికి వచ్చి కొత్తగా ట్రై చేయొచ్చు కదా..? అందుకే ఇప్పుడు మన హీరోలు ఇదే చేస్తున్నారు. నిన్నమొన్నటి వరకు హీరో అంటే అలా ఉండాలి.. ఇలా ఉండాలి అనుకున్న వాళ్లు.. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులుగా మారిపోతున్నారు. పబ్లిక్ సర్వెంట్స్ అయిపోయి ఆ పాత్రల్లోకి పరకాయ ప్రవేశం చేస్తున్నారు.