మన ఇండస్ట్రీలో హీరోలతో పాటు దర్శకులు కూడా చాలా నెమ్మదిగా సినిమాలు చేస్తుంటారు. ఇప్పుడు టాప్ హీరోలంతా వరస సినిమాలతో బిజీగా ఉన్నారు. కానీ దర్శకులు మాత్రం అలాగే నెమ్మదిగా ముందుకెళ్తున్నారు. 2021లో వస్తారనుకున్న చాలా మంది దర్శకులు, సినిమాలు కరోనా కారణంగా రాలేకపోయాయి. ఒక్కరు ఇద్దరు కాదు.. దాదాపు 15 మంది అగ్ర దర్శకులు 2021లో ఒక్కటంటే ఒక్క సినిమా కూడా రిలీజ్ చేయలేదు. అందులో ఎప్పట్లాగే రాజమౌళి, త్రివిక్రమ్, పూరీ జగన్నాథ్ లాంటి దర్శకులున్నారు.