సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు అంటే అవకాశాలు తగ్గిపోయి.. ఇంక చేసేదేం లేదు అనుకున్నపుడు అంటూ సమాధానం చెప్తుంటారు. అందులో నిజం కూడా లేకపోలేదు. 30 దాటినా కూడా పెళ్లి చేసుకోని హీరోయిన్లు చాలా మంది ఉన్నారు మన ఇండస్ట్రీలో. అలాంటి ఈ ఇండస్ట్రీలోనే 20 ఏళ్ళకే పెళ్లి చేసుకున్న వాళ్లు కూడా ఉన్నారు. పాతికేళ్లు కూడా లేకుండానే కెరీర్ పీక్స్‌లో ఉన్నపుడు వాళ్లు పెళ్లి చేసుకుని అందరికీ షాక్ ఇచ్చారు. ఒక్కరో ఇద్దరో కాదు.. దాదాపు డజన్ మంది ముద్దుగుమ్మలు చాలా చిన్న వయసులోనే పెళ్లి చేసుకున్నారు. నాటి దివంగత దివ్య భారతి నుంచి నేటి సయేషా సైగల్ వరకు అలాంటి హీరోయిన్లు ఎవరో చూద్దాం..