అనసూయ భరద్వాజ్ అనగానే ముందుగా గ్లామర్ క్వీన్ గుర్తుకొస్తుంది. బుల్లితెరను కూడా తన అందంతో వేడెక్కించడం అనసూయ స్టైల్. హీరోయిన్లు కూడా ఈమె గ్లామర్ షో ముందు దిగదుడుపే. ఇప్పటికీ జబర్దస్త్ కామెడీ షోలో అను సోకుల వల ముందు కుర్రాళ్ల గుండెలు పడి నలిగిపోతుంటాయి. 36 ఏళ్ల వయసులో కూడా అదిరిపోయే ఫిజిక్‌తో అందర్నీ మాయ చేస్తుంది ఈ ముద్దుగుమ్మ. అయితే అనసూయ భరద్వాజ్‌లో కేవలం గ్లామర్ కోణమే కాదు.. అద్భుతమైన అభినయం కూడా ఉందని చాలా మంది దర్శకులు ఇప్పటికే నిరూపించారు. అను పేరు వినగానే ముందుగా రంగస్థలం సినిమా గుర్తుకొస్తుంది. కానీ ఈమె చేసిన ప్రతీ పాత్ర వేటికవే భిన్నమైందే. ఇప్పుడు విడుదలైన పుష్పలో దాక్షాయణి సహా.. ఈ పాత్ర కోసం పూర్తిగా మేకోవర్ అయిపోయింది అనసూయ. మరి ఈ టాప్ యాంకర్ కెరీర్‌లోని టాప్ రోల్స్ ఏంటో చూసేద్దాం..