నిన్నటికి నిన్న కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ చనిపోతే చాలా మంది అభిమానుల గుండెలు ఆగిపోయాయి. ఆయన మరణం తట్టుకోలేక సెలబ్రిటీస్ కూడా కన్నీరు పెట్టుకున్నారు. ఈయన నటిస్తున్న చివరి సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది. అలా కొందరు చనిపోయిన తర్వాత వాళ్ళ చివరి సినిమాలు విడుదలయ్యాయి. అవేంటో ఒక్కసారి చూద్దాం..
పునీత్ రాజ్‌కుమార్: పునీత్ రాజ్‌కుమార్ హీరోగా నటిస్తున్న చివరి సినిమా ఇది. ఇదే ఆయన లాస్ట్ మూవీ అవుతుందని ఎవరూ అనుకోలేదు. 2022, మార్చ్ 17న విడుదల కానుంది ఈ సినిమా. ఆ రోజు ఆయన జయంతి కావడం గమనార్హం. ఇప్పటికే జేమ్స్ షూటింగ్ 90 శాతం పూర్తయింది. ఓ పాట మాత్రమే బ్యాలెన్స్ ఉంది. డబ్బింగ్ కోసం అత్యాధునిక టెక్నాలజీ వాడుకుంటున్నారు మేకర్స్.
శ్రీహరి: కెరీర్ పీక్స్‌లో ఉన్నపుడే హఠాన్మరణం చెందాడు రియల్ స్టార్ శ్రీహరి. హిందీ సినిమా రాంబో రాజ్‌కుమార్ షూటింగ్ కోసం ముంబై వెళ్లిన ఈయన అక్కడే లీలావతి హాస్పిటల్లో చనిపోయాడు. 2013 అక్టోబర్ 9న శ్రీహరి చనిపోతే.. ఆయన మరణానంతరం రాంబో రాజ్‌కుమార్ విడుదలైంది. తెలుగులో కూడా చాలా సినిమాలు ఆయన చనిపోయిన తర్వాత వేరే వాళ్ల డబ్బింగులతో విడుదలయ్యాయి.
శంకర్ నాగ్: కన్నడలో ఒకప్పుడు సూపర్ స్టార్ ఈయన. ఈ తరానికి తెలిసినా తెలియకపోయినా 80ల్లో శంకర్ నాగ్ అంటే సంచలనం. యాక్షన్ హీరోగా చక్రం తిప్పిన ఈయన 1990లో ఓ కార్ ప్రమాదంలో చనిపోయాడు. కేవలం 35 ఏళ్ల వయసులోనే శంకర్ నాగ్ కన్నుమూసాడు. అప్పటికే ఈయన చేతిలో చాలా సినిమాలున్నాయి. శంకర్ నాగ్ చనిపోయిన మూడేళ్ల వరకు కూడా ఆయన సినిమాలు విడుదల అవుతూనే ఉన్నాయి.