కొత్త హీరో సినిమా విడుదలైందంటే చాలు బాక్సాఫీస్ దగ్గర రచ్చ మొదలవుతుంది. ఇప్పుడు కూడా ఇదే జరిగింది. రాధే శ్యామ్ విడుదల తర్వాత మరోసారి రికార్డుల గురించి చర్చ మొదలైంది. నైజాంలో ఈ సినిమాకు మంచి ఓపెనింగ్స్ వచ్చాయి కానీ రికార్డులు మాత్రం రాలేదు. మొన్న పవన్ భీమ్లా నాయక్ రికార్డులు తిరగరాస్తే.. ఇప్పుడు వాటికి చాలా దూరంలోనే ఆగిపోయింది రాధే శ్యామ్.
మరే తెలుగు సినిమాకు సాధ్యం కాని స్థాయిలో రచ్చ చేసింది భీమ్లా నాయక్. బాహుబలి 2 పేరు మీదున్న రికార్డులను పుష్ప తుడిచేస్తే.. మొన్న పుష్ప రికార్డులను భీమ్లా తుడిచేసాడు. నైజాంలో మొదటి రోజే 11.85 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది భీమ్లా నాయక్. అయితే రాధే శ్యామ్ మాత్రం అలా చేయలేకపోయింది. మొదటి రోజు కేవలం 10.45 కోట్ల షేర్ మాత్రమే వసూలు చేసింది. మరి నైజాంలో మొదటి రోజు అత్యధిక షేర్ వసూలు చేసిన సినిమాలేంటో చూద్దాం..