ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వాలంటేనే కచ్చితంగా బ్యాగ్రౌండ్ ఉండాలంటారు.. ఇక స్టార్ హీరోగా మారాలంటే రాసిపెట్టి ఉండాలి. ఎలాంటి సపోర్ట్ లేకుండా.. గాడ్ ఫాదర్ లేకుండా వచ్చి ఇక్కడ సర్వై అవ్వడం అంటే చిన్న విషయం కాదు. కానీ గత పదేళ్లలో అన్ని ఇండస్ట్రీలలో కొందరు హీరోలు ఇది నిరూపించారు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి.. కేవలం తమ టాలెంట్‌తోనే సత్తా చూపించారు. ఈ రోజు స్టార్స్‌గా నిలబడ్డారు. తెలుగు ఇండస్ట్రీ నుంచి మొదలు పెట్టి కన్నడ, మలయాళం, తమిళం, హిందీ.. ఇలా ప్రతీ ఇండస్ట్రీలోనూ కొందరు హీరోలు కేవలం తమ టాలెంట్ మాత్రమే చూపించి స్టార్ హీరోలుగా ఎదిగారు. మరి అలాంటి నో బ్యాగ్రౌండ్ స్టార్స్ ఎవరో చూద్దాం..
7. ఆయుష్మాన్ ఖురానా: బాలీవుడ్లో బయటి హీరో వస్తే ఎలా చూస్తారో ఇప్పటికే చాలా మంది చెప్పారు. వీళ్ళ పోరు భరించలేక సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ లాంటి స్టార్ కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. అలాంటి ఇండస్ట్రీలో బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి స్టార్ హీరోగా మారాడు ఆయుష్మాన్ ఖురానా. ఈ హీరోలంతా ఈ రోజు ఇంత పెద్ద పొజిషన్లో ఉన్నారంటే కారణం బ్యాగ్రౌండ్ కాదు టాలెంట్.