సాధారణంగానే శుక్రవారం వచ్చిందంటే కొత్త సినిమాలు సందడి చేస్తుంటాయి. అలాంటిది పండగ కూడా వచ్చిందంటే నిర్మాతలకు సినిమాలు విడుదల చేసుకోడానికి అంతకంటే పెద్ద పండగ మరోటి ఉండదు. ఈ వారం కూడా ఇదే జరుగుతుంది. క్రిస్మస్ వీకెండ్ వరస సినిమాలు వస్తున్నాయి. ఒకటి రెండు కాదు.. దాదాపు 10 సినిమాల వరకు విడుదల అవుతున్నాయి. అందులో తెలుగు, హిందీ సినిమాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా నాని శ్యామ్ సింగరాయ్, అక్షయ్ కుమార్, ధనుష్ అతరంగీ రే, 83 లాంటి సినిమాలున్నాయి. మరి ఈ వారం రాబోయే సినిమాలేంటో చూద్దాం..
మ్యాట్రిక్స్: 1999లో వచ్చిన ది మ్యాట్రిక్స్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత ‘ది మ్యాట్రిక్స్ రీలోడెడ్’, ‘ది మ్యాట్రిక్స్ రెవెల్యూషన్స్’ చిత్రాలు కూడా వచ్చాయి. దాదాపు 13 ఏళ్ల తర్వాత ఈ సిరీస్లో వస్తున్న చిత్రం ‘ది మ్యాట్రిక్స్ రీసర్కషన్స్’(The Matrix Resurrections). లానా వచౌస్కీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా డిసెంబరు 22న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. కీనూ రీవ్స్, క్యారీ అన్నె మోస్లతో పాటు, బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా (Priyanka chopra) కీలక పాత్ర పోషిస్తున్నారు.