Chiranjeevi Old Titles: ‘ఘరానా మొగుడు’ కూడా వస్తున్నాడు.. చిరంజీవి ఓల్డ్ టైటిల్స్ వాడుకున్న 16 సినిమాలు ఇవే..

Chiranjeevi old titles: చిరంజీవి (Chiranjeevi) సినిమాలే కాదు.. ఆయన పాత టైటిల్స్ కూడా అభిమానులకు బాగా ఇష్టమే. ఫ్యాన్స్ కంటే కూడా మన దర్శక నిర్మాతలకు కూడా చిరు ఓల్డ్ టైటిల్స్ అంటే భలే యిష్టం. అందుకే ఇప్పటి సినిమాలకు చాలా వరకు చిరు టైటిల్స్ వాడేసుకుంటున్నారు. ఈ మధ్యే కార్తికేయ(Karthikeya) కూడా రాజా విక్రమార్క(Raja Vikramarka) అంటూ చిరు క్లాసిక్ టైటిల్‌ ప్రకటించాడు. ఇప్పుడు ఘరానా మొగుడు సినిమా కూడా వచ్చేస్తుంది. మరి అలా మెగాస్టార్ టైటిల్స్ వాడుకున్న హీరోలెవరో ఇప్పుడు చూద్దాం..