సాధారణంగా ఇండస్ట్రీలో నాని కథల ఎంపికపై చాలా నమ్మకం ఉంది. ఈయన ఓ కథ ఓకే చేసాడంటే కచ్చితంగా మినిమమ్ గ్యారెంటీ అనే నమ్మకం అందరిలోనూ వచ్చేసింది. అయితే కొన్నిసార్లు ఆయన కూడా కథలను సరిగ్గా అంచనా వేయలేక వదిలేసిన సందర్భాలు ఉన్నాయి. అనివార్య కారణాలతో కొన్ని సినిమాలు వదిలేస్తే.. మరికొన్ని డేట్స్ కుదరక వదిలేసాడు. అలా ఇన్నేళ్ళ ఆయన కెరీర్లో దాదాపు 10 సినిమాల వరకు నాని నో చెప్పాడు. నేచురల్ స్టార్ వదిలేసిన సినిమాల్లో చాలా వరకు విజయాలే ఉన్నాయి. మరి అవేంటి.. నాని ఎందుకు ఆ సినిమాలను వదిలేసాడు చూద్దాం..