Tollywood sequels: ఇదేందయ్యా ఇది.. టాలీవుడ్‌లో ఇప్పుడు 10 సీక్వెల్స్ వస్తున్నాయా..?

Sequels in Tollywood: సీక్వెల్ అనే మాట వింటే చాలు టాలీవుడ్ దర్శక నిర్మాతలకు భయం. దానికి కారణం గతంలో వచ్చిన చేదు జ్ఞాపకాలే. ఇప్పటి వరకు సీక్వెల్స్ హిట్ అయిన చరిత్ర తెలుగులో లేదు. బాహుబలి 2 (Bahubali 2) వచ్చినా అది సీక్వెల్ కాదు.. ఒకే కథకు రెండో బాగం అంతే. అలాంటిది ఇప్పుడు బ్యాడ్ సెంటిమెంట్ పక్కనబెట్టి వరస సీక్వెల్స్ చేస్తున్నారు. దాదాపు 10 సినిమాలకు పైగా సీక్వెల్స్ సిద్ధమవుతున్నాయిప్పుడు.